Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీ అలర్ట్: విజయానికి సంబంధించి పోస్టులపై అప్రమత్తం, అధికారికంగా ప్రకటిస్తేనే..

అమెరికా అధ్యక్ష పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను అలర్ట్ చేశారు. ఎలాంటి తప్పుడు సమాచారం, మ్యానిపులేషన్‌కు పాల్పడకుండా అప్రమత్తం చేశారు. వయోజనులు సరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2016 ప్రచారంలో ఫేస్‌బుక్, ట్వీట్టర్, గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి తప్పడు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. తిరిగి అలాంటి సమస్య పునరావృతం కాకుడదని భావిస్తున్నారు. అలాగే ఓటర్లను చివరి క్షణంలో ప్రభావితం కాకుండా చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్ పనిచేస్తోందని ఫేస్‌బుక్ వివరించింది. ఈ మేరకు పోస్ట్ చేసింది. తమ టీం.. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని తెలిపింది.

 Social media firms on alert for Election Day misinformation

ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నామని ఫేస్ బుక్ పేర్కొన్నది. ప్రచార సందర్భంగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ను అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన మద్దతుదారులు చుట్టుముట్టునట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రతీ అంశాన్ని నిశీతంగా గమనిస్తున్నామని తెలిపింది. ఇబ్బంది కలిగించే కంటెంట్ ఉంటే తక్షణమే తొలగిస్తున్నామని పేర్కొన్నది.

ముందస్తుగా విజయం సాధిస్తామనే పోస్టులు కనిపించకుండా చేస్తామని తెలిపారు. అయితే అభ్యర్థి/ పార్టీ ప్రకటిస్తే.. తాము మరింత సమాచారం జోడిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఫలితాలను కూడా వెంట వెంటనే అందులో ఇస్తామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+