solar eclipse 2023: ప్రారంభమైన సూర్యగ్రహణం.. వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు కొనసాగుతోంది. దాదాపు మొత్తం 5 గంటల 25 నిమిషాల పాటు గ్రహణం ఉండనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. పశ్చిమ ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాలు, చైనా, థాయ్‌లాండ్, అమెరికా, మలేషియా, జపాన్, న్యూజిలాండ్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే కనిపిస్తుంది.
ఈ సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రెండు రకాల గ్రహణాలు ఒకేసారి కనిస్తాయన్నాయని తెలిపారు. భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ, దీనిని ఆన్‌లైన్‌లో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుని ఛాయ(నీడ) ఆస్ట్రేలియా అంచులో 40 కిలోమీటర్ల విస్తృతితో ఉండే మార్గంలో పడుతుందని చెప్పారు.

ప్రపంచంలో అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒకదాని గుండా ఈ మార్గం ఉందన్నారు. నింగలూ ప్రాంతం గుండా ఈ గ్రహణం కనిపిస్తుండటంతో దీనికి నింగలూ గ్రహణం అని పేరు పెట్టారు. ఇది హైబ్రిడ్ సూర్య గ్రహణంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
దీనిని యాన్యులార్-టోటల్ ఎక్లిప్స్ (వృత్తాకారంలో-సంపూర్ణంగా ఉండే గ్రహణం) అని కూడా అంటారని చెబుతున్నారు. సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు వచ్చినపుడు, భూమిపై నీడ పడుతుందని అప్పుడే సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెబుతున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్య గ్రహణం సమయంలో వండటం లేదా తినడం చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట. గర్భం దాల్చిన మహిళలు సూర్య గ్రహణం చూడకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మకర రాశి జాతకులు గ్రహణం తొలగిన వెంటనే గొడుగు, నలుపు లేదా నీలం బట్టలు, ఆవాల నూనె, నువ్వులు వంటివి దానం చేయడం అనివార్యమంటున్నారు.
మీనరాశి జాతకులు గ్రహణం తరువాత బెల్లం, శెనగపప్పు, పసుపు వస్త్రాలు దానం చేయాలి.కుంభ రాశి జాతకులు సూర్య గ్రహణం అయిపోయిన వెంటనే గొడుగు, నలుపు లేదా నీల బట్టలు, ఆవాల నూనె దానం చేయడం మంచిదట. మేషరాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఈ రాశి వారిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, రాహువు కలయిక వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications