విడాకులివ్వకుండానే 11 మందితో వివాహం: వివాహితను రాళ్ళతో కొట్టిన చంపారు

Recommended Video

    వివాహితను రాళ్ళతో కొట్టిన చంపారు

    మొగదిషు: విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్న ఓ మహిళలను రాళ్ళతో కొట్టి చంపిన ఘటన సోమాలియాలో చోటు చేసుకొంది. ఆల్ షబాబ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన వారు ఈ మహిళకు అత్యంత దారుణమైన ఈ శిక్షను విధించారు.

    సోమాలియా రాజధాని మొగదిషుకు సమీపంలో షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళ విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొంది. ఈ విషయం ఇటీవల బట్టబయలైంది. షరియా చట్టం ప్రకారంగా ఈ రకంగా వివాహలు చేసుకోవడం తప్పని ఆల్ షబాబ్ మిలిటెంట్లు వాదిస్తున్నారు.

    Somali woman with 11 husbands stoned to death by al-Shabab

    ఆల్ షబాబ్ మిలిటెంట్లు షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళను ఎట్టకేలకు పట్టుకొన్నారు. విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్నందుకు గాను ఆమెను కొట్టి చంపాలని నిర్ణయించారు.

    విచారణ సమయంలో ఆమె 8 మంది భర్తలను పిలిపించారు. 8 మంది కూడ ఆమె తన భార్యగా చెప్పారు. ఆ మహిళకు 8 మంది పిల్లలున్నారు. దీంతో ఆమెను కొట్టి చంపాలని ఆ మిలిటెంట్ సంస్థ తీర్మానం చేసింది. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ ను గొంతు వరకు భూమిలో పూడ్చేశారు. రాళ్ళతో కొట్టి చంపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+