రియల్ స్టోరీ: ఫేస్‌బుక్ రిక్వెస్ట్‌తో దొంగలో పరివర్తన
సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓ దొంగ బుద్ధిని మార్చేసింది. సాధారణంగా మన ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోలను పోలీసులకు చూపించి నిందితుడిని పట్టుకోవాల్సిందిగా కోరతాం.
అయితే కెనడాకు చెందిన ఓ చిరు వ్యాపారి మాత్రం ఇందుకు భిన్నంగా చేశాడు. తన షాపులో చోరికి పాల్పడిన దొంగ ఎవరో తెలుసుకుని అతడికి ఫేస్‌బుక్‌లో ప్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అంతేనా... దొంగలో మార్పు తెచ్చి తన విలువైన వస్తువులన్నింటినీ రికవరీ చేసుకున్నాడు.

కెనడాలోని గిల్మి పట్టణంలో ఆసక్తిరేకిత్తించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గిల్మి పట్టణంలో 117 ఏళ్ల నాటి 'హెచ్.పీ.టెర్జిసెన్ అండ్ సన్స్' పేరుతో గిఫ్ట్ షాపు ఉంది. ఇటీవల ఆ గిప్ట్ షాపులో ఓ దొంగ చొరబడి నగదుతో పాటు విలువైన వాచీలను ఎత్తుకెళ్లాడు.
ఈ దొంగతనం జరిగిన తీరు షాప్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అయితే బాధితుడు టెర్జిసెన్ సీసీటీవీ పుటేజీతో పోలీసులను సంప్రదించకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోని 24 గంటల్లో సుమారు 8,000 మంది షేర్ చేశారు.
దీంతో వీడియో వైరల్ కావడంతో ఒక్కరోజులోనే నెటిజన్లు ఆ దొంగను గుర్తించారు. దొంగ పేరు కూడా చెప్పారు. దీంతో ఆ షాప్ యజమాని దొంగకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ రిక్వెస్ట్‌ను చూసిన ఆ దొంగ.. తనను క్షమించండి అంటూ దొంగతనం చేసిన సొమ్మంతా తిరిగి ఇచ్చేశాడు.
''నేను అతని దుకాణంలో దొంగతనం చేస్తే.. ఆయన మాత్రం నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతను చాలా గొప్ప వ్యక్తి. నేను చేసిన తప్పునకు ఏ శిక్ష విధించినా సరే'' అంటూ రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో ఆ దొంగపై కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications