వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యలను ఎలా కొట్టాలో.. చూసి నేర్చుకోమంటున్నాడు

|
Google Oneindia TeluguNews

మతాలైనా.. విశ్వాసాలైనా.. మనుషులను ఉద్దరించడానికి ఏర్పరుచుకున్నవే గానీ తోటి మనుషులను హింసించడాకి కాదు. తాజాగా ఇందుకు విరుద్దంగా సౌదీలో ఓ మత పెద్ద చేసిన పని విస్మయానికి గురి చేస్తోంది. భార్యను ఎలా శిక్షించాలో చెబుతూ ఆ మత పెద్ద ఏకంగా వీడియోనే ఇంటర్నెట్ లో వదిలారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

సౌదీ అరేబియాలో థెరపిస్టుగా పనిచేసే ఖలీల్ అల్ సఖాబీ అనే వ్యక్తి.. భర్తల సూచనలను పాటించని భార్యలను ఎలా దండించాలో చెప్పడానికి ఓ వీడియోనే రూపొందించాడు. ఇంతకీ ఆ వీడియోలో సదరు మత పెద్ద ఏం చెప్పుకొచ్చారంటే.. నిజానికి భార్యను దండించడమనేది చాలా కష్టమైన పని. కానీ అల్లా ఆశీస్సులతో సమస్య నుంచి సురక్షితంగా బయటపడుతామని వివరించాడు.

soudi arabia, wife, punishment, khalil al sakhabi

ఇంకా మాట్లాడుతూ.. భార్యను కోపంతో కొట్టవద్దు, కొట్టేప్పుడు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలి. ముఖ్యంగా ఈ విషయంలో ఇస్లాం నిబంధనలను పాటించాలని, ఇనుప రాడ్లు, కర్రల వంటి వస్తువులు, పదునైన ఆయుధాలు కాకుండా పళ్లను శుభ్రం చేసుకునే చువ్వ లాంటి వస్తువు లేదా, హ్యాండ్ కర్చీఫ్ వస్తువులను ఉపయోగించాలని తెలిపాడు.

భార్యను కొట్టేముందు భార్య భర్తల హక్కులు, విధుల గురించి అల్లా ప్రకారం భార్యకు తెలియజేయాలని చెప్పాడు. అలాగే నిద్రపోతున్న భార్య దగ్గరకు వెళ్లవద్దని చెప్పిన మతపెద్ద అసలు సమస్యంతా భర్తలతో సమానంగా భార్యలు జీవించాలని కోరుకోవడంలోనే ఉందని చెప్పుకొచ్చాడు. భార్యను కొట్టేటప్పుడు విషయం బయటకు పొక్కకుండా చూసుకోవాలని, కొంతమంది భార్యలు కొట్టించుకోవడం కోసమే భర్తలను రెచ్చగొడుతుంటారని ముగించాడు.

English summary
Khaled Al-Saqaby appears in the ‘show’ which is put out on YouTube, which includes ‘dealing with wife beating’.The four-minute footage begins with Mr Al-Saqaby telling men not to simply attack their wives, but discipline them properly,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X