పురుషాంగం లేని యువకుడికి...... మగతనం వచ్చేసింది
వైద్యచరిత్రలో మరో రికార్డు స్పృష్టించారు. పురాషాంగం కోల్పోయిన వ్యక్తికి మగతనం ప్రసాదించిన దక్షిణ ఆఫ్రికా వైద్యులు ప్రపంచ రికార్డు స్పృష్టించారు. 21 సంవత్సరాల యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
దక్షిణ ఆఫ్రికాలోని యూనివర్శిటి ఆఫ్ స్టెల్లెన్బోస్స్ ప్రోఫెసర్ల సహకారంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని కేప్ టౌన్ లోని టైగర్ బర్గ్ ఆసుపత్రి వైద్యులు మీడియాకు తెలిపారు. వైద్యుల కథనం ప్రకారం వివరాలు ఈ విదంగా ఉన్నాయి. 21 సంవత్సరాల యువకుడు మతం మార్చకుని ఇస్లాం మతం స్వీకరించాడు.
ఇస్లాం మతం ఆచారంలో భాగంగా అతను సున్తీ చేయించుకున్నాడు. తరువాత వయస్సు పై బడిన తరువాత సున్తీ చేయించుకోవడం, వైద్యులు చెప్పిన సలహాలు పాటించకపోవడంతో అతని మర్మాంగానికి ఇన్ఫెక్షన్ అయ్యింది. తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. వైద్యలు అతనికి అనేక వైద్య పరిక్షలు నిర్వహించినా ఫలితం లేకపోయింది.

చివరికి యువకుడి ప్రాణాలు పోయే పరిస్థితి రావడంతో వైద్యులు అతని మర్మాంగాన్ని తోలగించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఆయువకుడు మర్మాంగం లేకుండ జీవిస్తున్నాడు. కొంత కాలం క్రితం ఒక వ్యక్తి అనారోగ్యానికి గురై తన అవయవాలు దానం చేస్తానని వైద్యులకు చెప్పాడు.
మూడు సంవత్సరాల క్రితం కేప్ టౌన్ వైద్యులు ఎవరికైనా మర్మాంగం కావాలంటే అమర్చుతామని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఆ యువకుడిని ఆకట్టుకునింది. వెంటనే ఆ యువకుడు వైద్యులను సంప్రదించాడు. యువకుడికి వైద్య పరిక్షలు నిర్వహించిన వైద్యులు మర్మాంగం అమర్చాలని నిర్దారించారు.
తరువాత అనారోగ్యంతో భాదపడుతున్న వ్యక్తి మర్మాంగం తీసి యువకుడిని అమర్చించారు. ఆపరేషన్ సక్సస్ కావడంతో కేప్ టౌన్ ఆసుపత్రి వైద్యులు ప్రపంచ రికార్డు స్పృష్టించారు. ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్న సమయంలో వారు ఈ వివరాలను ప్రపంచానికి తెలిపారు. ఆ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడని, అతనికి మగతనం వచ్చిందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications