అక్కడ స్కాలర్ షిప్ పొందాలంటే ’కన్య’గా వుండాలి
జోహన్నెస్‌బర్గ్: ఎక్కడైనా పాఠశాలలు, కళాశాలల్లో స్కాలర్‌షిప్‌లు రావాలంటే మంచి మార్కులు, హాజరులాంటివి కొలమానంగా పరిగణిస్తుంటారు. అయితే దక్షిణ ఆఫ్రికాలోని క్వాజులా నాతల్ రాష్ట్రంలోని ఉతుకెలా జిల్లాలో మాత్రం స్కాలర్‌షిప్ కావాలనుకునే బాలికలు, యువతులకు ఉండాల్సిన అర్హత.. కన్యత్వమే కావడం గమనార్హం..
అయితే, ఇలా నిర్ణయించడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కడ పలువురు బాలికలు చదువు పూర్తయ్యేలోపు తల్లులవుతున్నారు. అంతేగాక, అక్కడి విద్యాశాఖ అందించిన వివరాల ప్రకారం.. పాఠశాలల్లోనే గర్భం దాల్చిన బాలికల సంఖ్య ఇప్పటి వరకు దాదాపు 20,000.
2014లో పాఠశాలల్లో గర్భవతులుగా ఉన్న బాలికల సంఖ్య 223గా ఉందట. ఇలా చిన్న వయసులోనే గర్భధారణను అరికట్టేందుకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లాంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవటం, బాలికలు చదువు పూర్తయ్యే వరకు పూర్తిగా దానిపైనే దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తూ ఆ ప్రాంత మేయర్ ఈ స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించారు.

స్కాలర్‌షిప్‌లు కావాలనుకునేవారు కన్యత్వ పరీక్షల్లో పాస్‌కావాల్సి ఉంటుందట. వీటి కోసం స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావచ్చని ఆయన తెలిపారు. మేయర్ నిర్ణయంపై కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు మండిపడుతున్నారు.
కన్యత్వ పరీక్షలు నిర్వహించడం సరికాదని అంటున్నారు. అయితే ఆ ప్రాంత మేయర్ డుడు మజిబుకో మాత్రం ఇది బాలికల మంచికేనని వారి సమ్మతితో కన్యత్వ పరీక్షలు జరపడం చట్ట విరుద్ధం కాదని పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications