2 విమానాలు ఢీ: చాకచక్యంగా తప్పించుకున్న పైలట్లు
సౌత్ కరోలినా: అమెరికాలోని జార్జియాలో రెండు ఎఫ్ - 16 ఫైటర్ జెట్స్ గాల్లో ఢీకొన్నాయి. అయితే అదృష్టవశాత్తు పైలట్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సౌత్ కరోలినా ఎయిర్ నేషనల్ గార్డ్స్‌కు చెందిన రెండు జెట్ విమానాలు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ట్రెయినింగ్ సెషన్‌లో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఇద్దరు పైలట్లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా విమానాలు ఢీ కొట్టడంతో కూలిపోయాయి. అప్రమత్తమైన పైలట్లు చాకచక్యంగా ఎజెక్ట్ బటన్ ఉపయోగించి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ట్రెయినింగ్ సమయంలో ఇలా ప్రమాదాలు సంభవించిన ఘటనలు చాలానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications