గన్ తో బెంబేలెత్తించిన కుర్రాడు.. కన్నతండ్రినే పొట్టనబెట్టుకున్నాడు

టౌన్ విల్లే : అమెరికాలో గన్ కల్చర్ ఎంతలా నాటుకుపోయిందో తెలియజెప్పే ఘటన ఇది. స్కూల్ కు వెళ్లే పిల్లవాడు గన్ తో గందరగోళం సృష్టించాడు. తండ్రిని పొట్టనబెట్టుకోవడంతో పాటు స్కూల్లోను పలువురిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. బుధవారం నాడు మధ్యాహ్నాం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఓ టీనేజీ కుర్రాడు స్కూల్ కు వెళ్లబోయే ముందు గన్ తో తన తండ్రి జెఫ్రీ ఒస్బ్రోన్ ని కాల్చాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందగా.. అక్కడి నుంచి మధ్యాహ్నాం 1:45గం.ల ప్రాంతంలో టౌన్ విల్లే ప్రాంతంలో తను చదువుకునే ఎలిమెంటరీ స్కూల్ వద్దకు చేరుకున్న బాలుడు.. అక్కడ కూడా గన్ కు పనిచెప్పాడు. ఇద్దరు విద్యార్థులతో పాటు ఓ టీచర్ పైకి గన్ ఎక్కుపెట్టాడు. దీంతో వారు ముగ్గురికి తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి.

నార్త్ ఈస్ట్ అట్లాంటా కు 110 మైల్స్ దూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన టౌన్ విల్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై స్పందించిన స్కూల్ సూపరిండెంట్ జోన్నే అవెరీ సదరు కుర్రాడు చేసిన దుర్మార్గపు చర్యకు నిర్ఘాంతపోయామని, హ్రుదయం బద్దలైనంత పనయిందని తెలిపారు. అభద్రతా వాతావరణం నెలకొనడంతో స్కూల్ వారం రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించినట్టు తెలియజేశారు.

South Carolina shooting: 14-yr-old killed father before opening fire in school

ఘటనాననంతరం తన నానమ్మకు ఫోన్ చేసిన ఆ కుర్రాడు తాను చేసిన నిర్వాకం గురించి ఆమెకు ఏడుస్తూ వివరించాడు. దీంతో కుర్రాడి ఇంటికి సమీపంలోనే ఉండే అతని నానమ్మ పరుగున తన కొడుకు ఇంటికి పరిగెత్తగా.. బుల్లెట్ గాయాలకు ఆమె కొడుకు అప్పటికే మృతి చెందాడు. స్కూల్ లోకి ప్రవేశించాక తొలుత పార్కింగ్ స్థలం వైపు వెళ్లిన ఆ కుర్రాడు.. అప్పుడే వాహనం నుంచి దిగుతోన్న షెరిఫ్ జాన్ అనే వ్యక్తికి గన్ గురిపెట్టగా అతను తప్పించుకున్నాడు. దీంతో అక్కడినుంచి స్కూల్ వైపుగా కుర్రాడు వెళ్లినట్టు షెరిఫ్ తెలిపాడు.

కాగా, ఇప్పటివరకు ఆ కుర్రాడికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం కాలేదు. అయితే అతడి వయసు మాత్రం 14సంవత్సరాలు ఉంటుందని స్కూల్ యాజమాన్యం చెప్పినట్టు సమాచారం. ఘటనకు సంబంధించి ఎలాంటి జాతి వివక్ష కారణాలు గానీ, ఉగ్రవాద ఛాయలు గానీ లేవని స్కూల్ యాజమాన్యం ప్రకటించినట్టు తెలుస్తోంది. దాడిలో గాయపడిన ముగ్గురిలో జాకబ్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా ఇద్దరూ అదే రోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఇదిలా ఉంటే సదరు కుర్రాడు స్కూల్లో గన్ తో హల్ చల్ చేయడంతో.. చాలామంది విద్యార్థులు బాత్ రూమ్స్ లో, మరికొంతమంది స్కూల్ పైబాగంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+