కిమ్‌కు షాక్: బాంబులతో విరుచుకపడిన దక్షిణ కొరియా
సియోల్: అమెరికాకు సవాల్ విసురుతున్న ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా నుండి తీవ్రమైన హెచ్చరికలు చేసింది. ఉత్తర కొరియా అమెరికా సహ దక్షిణ కొరియా జపాన్ దేశాలకు చుక్కలు చూపింది అయితే ఉత్తరకొరియా సరిహద్దుల్లో దక్షిణ కొరియా బాంబు దాడులకు మంగళవారం నాడు బాంబు దాడులకు పాల్పడింది.
తన ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలోనే ఉత్తరకొరియా జపాన్ ద్వీపమైన హెక్కాయ్ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది ఉత్తరకొరియా.ఈ క్షిపణి ప్రయోగం గురించి దక్షిణ కొరియా ఇంటలిజెన్స్‌కు ముందే సమాచారం ఉంది.
ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా బాంబుల వర్షం కురిపించింది. తమ శక్తి సామర్థ్యాలను కిమ్‌కు తెలపాలనే ఉద్దేశ్యంతో దక్షిణ కొరియా ఉత్తరకొరియా సరిహద్దుల్లో బాంబుల వర్షం కురిపించింది.

ఈ రెండు దేశాల సరిహద్దుల్లోని ఎనిమిది బాంబులను వేసే ప్రక్రియకు అధ్యక్షుడు మూన్ జె ఇన్ ఆదేశాల మేరకే బాంబు దాడులు చేసినట్టు చెప్పారు.
ఎఫ్ 15 కె ఫైటర్ జెట్ల ద్వారా ఎనిమిది మార్క్ 84 బాంబులను సరిహద్దులో వేస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. ప్రకటించినట్టుగానే దక్షిణ కొరియా బాంబుదాడికి పాల్పడింది.
మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. ఉత్తర కొరియా క్షిపణి దాడులకు పాల్పడుతోందని జపాన్ ఆ దేశ ప్రజలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications