Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: కిమ్ తల నరికేందుకు 3 వేల మంది కమెండోలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉత్తరకొరియాను భయపెట్టేందుకు దక్షిణ కొరియా రంగం సిద్దం చేసింది. తమ సత్తా ఏమిటో చూపుతామని దక్షిణకొరియా అంటోంది.

సియోల్: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉత్తరకొరియాను భయపెట్టేందుకు దక్షిణ కొరియా రంగం సిద్దం చేసింది. తమ సత్తా ఏమిటో చూపుతామని దక్షిణకొరియా అంటోంది. అర్ధరాత్రి సమయాల్లో సరిహద్దు దాటి ఉత్తరకొరియన్ల తలలు నరికేందుకు సిద్దమౌతున్నట్టు దక్షిణ కొరియా ప్రకటించింది.

వరుస అణు పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అమెరికాతో పాటు మిత్ర దేశాలు ఉత్తరకొరియా తీరుతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వైఖరిపై ఐక్యరాజ్యసమితి కూడ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికా ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తరకొరియాపై తాజాగా ఆంక్షలు విధించింది.అయితే ఈ ఆంక్షల విధింపుపై ఉత్తరకొరియా కూడ తీవ్రంగానే స్పందించింది.

అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కొరియా హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు కూడ ఉత్తరకొరియాపై సమరానికి సై అంటున్నాయి.

ఉత్తర కొరియన్ల తలలను నరుకుతాం

ఉత్తర కొరియన్ల తలలను నరుకుతాం

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా అమెరికాతో పాటు మిత్రదేశాలు కూడ కొరియాపై కోపంగా ఉన్నారు.సరిహద్దు దాటి ఉత్తరకొరియన్ల తలలను నరికేందుకు ప్లాన్ చేసినట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. 'స్పార్టన్ 3000' పేరుతో ఓ టీమ్‌ను తయారు చేసినట్టు దక్షిణ కొరియా ప్రకటించింది.

Recommended Video

    US Envoy Nikki Haley over North Korea కిమ్ జాంగ్ కు యుద్దం ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు
    కిమ్‌ను చంపేందుకే ప్రయత్నం

    కిమ్‌ను చంపేందుకే ప్రయత్నం

    ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు ఇబ్బంది పెట్టేందుకు గాను తాము ప్లాన్ చేస్తున్నట్టు దక్షిణ కొరియా భావిస్తోంది.ఉత్తరకొరియాలోకి చొరబాటు చేసి ఆ దేశాధినేత కిమ్ సంగ్ 2 చంపేందుకు దక్షిణ కొరియా గతంలో చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో దక్షిణ కొరియా శిక్షణలో ఆరితేరిన కమాండోలు కిమ్ సంగ్‌2 గొంతుకోసి చంపేందుకు ఉత్తరకొరియా అధ్యక్ష భవనంలోకి చొరబాటు చేశారు. సంగ్‌ను అంతమొందించే ప్రయత్నం విఫలం చెందడంతో కమాండోలు ఉత్తరకొరియన్లకు చిక్కకుండా ప్రాణాలు తీసుకొన్నారు.మరికొందరు దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చారు.

    కిమ్‌కు బుద్దిచెప్పేందుకు దక్షిణ కొరియా ప్లాన్

    కిమ్‌కు బుద్దిచెప్పేందుకు దక్షిణ కొరియా ప్లాన్

    చర్చల ద్వారా సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ సంకేతాలు పంపినా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో తలలు నరికే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు దక్షిణ కొరియాప్రకటించింది.

    హెలిక్యాప్టర్లు, విమానాల్లో సరిహద్దు దాటి..

    హెలిక్యాప్టర్లు, విమానాల్లో సరిహద్దు దాటి..

    ఉత్తరకొరియన్ల తలలు నరికేందుకుగాను దక్షిణ కొరియా ఈ ఏడాది చివరికల్లా స్పార్టన్ 3000 టీమ్‌ను రంగంలోకి దించుతామని దక్షిణకొరియా రక్షణశాఖమంత్రి సాంగ్ యంగ్ మూ తెలిపారు. స్పార్టన్ టీమ్ హెలిక్యాప్టర్లు, ట్రాన్స్‌పోర్ట్ విమానాలతో అర్ధరాత్రి పూట సరిహద్దు దాటి శత్రువుల తలలు నరికి తీసుకురానుందని దక్షిణ కొరియా రక్షణ మంత్రి ప్రకటించారు.కిమ్‌తో పాటు ఆయన కీలక అధికారులను హతమార్చేందుకు అమెరికా సహకారంతో దక్షిణ కొరియా ఈ కార్యక్రమానికి పూనుకొందననే ప్రచారం కూడ ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+