షాకింగ్: కిమ్ జాంగ్‌పై కుట్రలు బద్దలు..ఫేక్ వార్తలపై మీడియా క్షమాపణ..‘ప్రాణం నిలబెట్టిన’ శత్రుదేశం..
తాను చనిపోయిన తర్వాత కూడా జనం వెన్నుల్లో వణుకు పుట్టించేవాడే నియంత. అలాంటి నియంతలకు తాతలాంటోడు నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్. అంతటి కిరాక్ మనిషి కాస్తా ఇటీవల గుండె సర్జరీ చేయించుకోవడంతో డీలా పడిపోయాడని.. చావుకు దగ్గరగా 'గ్రేవ్ డేంజర్'లోకి వెళ్లిపోయాడని.. ఆయన పదవీబాధ్యతల్ని సోదరి కిమ్ యో జాంగ్ చేపడతారంటూ గడిచిన కొద్ది గంటలుగా పుంఖానుపుంఖాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఫేక్ వార్తలేనని సాక్ష్యాత్తూ వాటిని పుట్టించిన 'డెయిలీ ఎన్‌కే' మీడియానే క్షమాపణలు చెప్పుకుంది. దీంతో కిమ్ పై కుట్రల వ్యవహారం మరోసారి బద్దలైనట్లయింది. ఈ క్రమంలో కొన్ని వింతలు కూడా చోటుచేసుకున్నాయి..

అసలేం జరిగిందంటే..
36 ఏళ్ల కిమ్ జాంగ్ ఉన్ బేసిగ్గా స్థూలకాయుడు, విపరీతంగా పొగతాగుతాడు, గుండె సమస్యలతో బాధపడుతున్నాడని, చివరిసారిగా ఏప్రిల్ 11న కరోనా వైరస్ పై రివ్యూ మీటింగ్ లో కనిపించిన ఆయన.. తాత, తండ్రుల జయంతి వేడుకల్లోనూ పాల్గొనలేదని, కార్డియో సర్జరీ చేయించుకున్న కారణంగానే ఆయన బయటికి రాలేదని, పైగా, సర్జరీ తిరగబెట్టడంతో ప్రాణాపాయ పరిస్థితి నెలకొందని ‘డెయిలీ ఎన్ కే'అనే వెబ్ సైట్ మొదటిగా వార్తను ప్రచురించింది. నార్త్ కొరియాలో మీడియాపై నిషేధం కొనసాగుతున్న దరమిలా, సౌత్ కొరియా కేంద్రంగా పనిచేసే సంస్థలు ఇచ్చే సమాచారమే ప్రపంచానికి చేరుతుంది. స్థానికంగా పాపులరైన ‘డెయిలీ ఎన్‌కే' ప్రచురించిన వార్తను.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సీఎన్ఎన్ ప్రసారం చేయడంతో విషయం అంతరీక్షమంత విస్తరమైపోయింది. అయితే..

చేతులెత్తేసిన సోర్స్..
కిమ్ జాంగ్ ఉన్ చావుకు దగ్గరయ్యారన్న వార్త ప్రపంచాన్ని ఊపేసింది. కరోనా విజృంభణలోనూ ఆయనకు సంబంధించిన వార్తల్ని జనం సీరియస్ గా చదివేశారు. అటు నార్త్ కొరియాలోనూ దీనిపై చర్చజరిగినట్లు తెలిసింది. మొత్తానికి కొన్ని గంటల వ్యవధిలోనే.. సదరు వార్తల్నీ తప్పుడు సమాచారంతో కూడుకున్నవని ‘డెయిలీ ఎన్‌కే' ప్రకటించింది. అంతేకాదు, కిమ్ సర్జరీపై సోర్సులు చెప్పిన విషయాలను మాత్రమే ప్రచురించామని, అందులోని సమాచారాన్ని ధృవీకరించడంలేదని సవరణలు, క్షమాపణలు చెప్పుకుంది. ఇది జరగడానికి కొద్ది గంటల ముందు మరో షాకింగ్ మలుపూ చోటుచేసుకుంది..

ప్రాణాలు నిలబెట్టారు..
పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేత స్థాయిలో సౌత్ కొరియా, నార్త్ కొరియా తలపడుతుండటం తెలిసిందే. కిమ్ జాంగ్ ఆరోగ్యానికి సంబంధించి లోకల్ మీడియా రాసిన కథనాన్ని అమెరికా సీఎన్ఎన్ చానెల్ ప్రసారం చేయడంతో దీనికి ఎనలేని ప్రధాన్యం ఏర్పడింది. గంటగంటకూ వార్తల ఉధృతి పెరుగుతోన్నక్రమంలో ఈ ఘటనపై సౌత్ కొరియా ప్రెసిడెంట్ స్పందించారు. ప్రెసిడెంట్ ఆఫీస్ అధికారిక ప్రతినిధి కాంగ్ మిన్సోక్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. కిమ్ జాగ్ ఆరోగ్యం పాడైపోయిందన్న వార్తల్ని ఆయన ఖండించారు. నార్త్ కొరియాలో ప్రస్తుతానికి అలజడి పరిస్థితులేవీ లేవని, అంతా ప్రశాంతంగా ఉందని చెప్పారు. ఎంత శత్రువైనప్పటికీ, కిమ్ జాంగ్ పై ఫేక్ వార్తల్ని ఖండించడం ద్వారా శత్రుదేశం సౌత్ కొరియా పరోక్షంగానైనా ఆయన ప్రాణాలను కాపాడింది. తాజా ఘటనతో కిమ్ పై కుట్రలు మరోసారి బద్దలయ్యాయని నార్త్ కొరియా అనుకూల వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా,

కరోనా కేసులు జీరో?
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25లక్షలు దాటింది. మరణాల సంఖ్య రెండు లక్షల దిశగా కదులుతోంది. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 6.6లక్షలుగా ఉంది. 180కిపైగా దేశాలు వైరస్ కాటుకు గురికాగా, కిమ్ జాంగ్ నేతృత్వంలోని నార్త్ కొరియాలో మాత్రం ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. గతవారం చేసిన అధికారిక ప్రకటనలోనూ అక్కడి ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పస్టం చేసింది. కానీ సౌత్ కొరియాలో ఆశ్రయం పొందుతోన్న నార్త్ కొరియన్ డాక్టర్లు మాత్రం కిమ్ వాదనను ఖండిస్తున్నారు. మీడియాను కంట్రోల్ లో పెట్టుకుని కిమ్ తను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతున్నాడని డాక్టర్లు విమర్శిస్తున్నారు. ఈలోపే..

సాయం కోరిన ఉ.కొరియా..
పకడ్బందీ క్వారంటైనింగ్ ద్వారా తమ దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నామన్న ఉత్తరకొరియా అధికారులు.. సాయం చేయాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను అర్ధించాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా నియంత్రణకు సహకరించాలని, అందుకు వీలుగా తమపై కొనసాగుతోన్న ఆంక్షలను సడలించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితిని ఉత్తరకొరియా కోరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Recommended Video
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications