Spain train crash: ఘోర రైలు ప్రమాదం.. 39 మందికిపైగా మృతి

స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హై స్పీడ్ ట్రెయిన్స్ ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో 39 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. రెన్ఫో , ఐరియో అనే రెండు కంపెనీలకు చెందిన రైళ్లు ప్రమాదవశాత్తు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన బుధవారం ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనపై క్యాస్టిల్లా లా మంచా ప్రాంత ప్రభుత్వ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రెండు క్యారేజీలు పట్టాలు తప్పాయని అన్నారు. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.

స్పెయిన్ లోని టోలెడో ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇక ఈ ఘటనతో ఆ రైలు మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాడ్రిడ్, సియూడాడ్ రియల్ అండ్ అండాలూసియా ప్రాంతాల్లో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రైళ్లు ఒకే మార్గంలో వేగంగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. ఓ రైలు చివరి భాగం మరో రైలుపై పడడంతో రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొంది.

ఇక ఈ రైలు ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోలెడో ప్రావిన్స్ లో జరిగిన ఈ రైలు ప్రమాదం తనను షాక్ కు గురి చేసిందని అన్నారు. ఈ రైలు ప్రమాద తీవ్రత తనకు అర్థం అవుతుందని తెలిపారు. క్యాస్టిల్లా లా మంచా ప్రెసిడెంట్ అలాగే ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ తో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో ఎమర్జెన్సీ సేవలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. క్షతగాత్రులను ఇప్పటికే సమీప ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Spain train crash Over 39 people killed and many others seriously injured after two trains collide

ఇక మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో ఇలాంటి ఘటనే స్పెయిన్ లో జరిగింది. అప్పుడు జరిగిన రైలు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. అంతకుముందు 2013 లో స్పెయిన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 80 మంది మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+