వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవహరీపై అమెరికా ఉపయోగించిన ఆయుధం ప్రత్యేకత...

|
Google Oneindia TeluguNews

అమెరికాలో 9/11 దాడుల వ్యూహ‌క‌ర్త‌లైన ఉగ్ర‌వాదుల‌ను సీఐఏ అత్యంత ప‌క‌డ్బందీగా మ‌ట్టుబెడుతోంది. తాజాగా అల్‌ఖైదా ఉగ్ర‌నేత అల్ జ‌వ‌హ‌రీని హ‌త‌మార్చింది. అత‌డిని మ‌ట్టుబెట్టేందుకు అమెరికా 20 సంవ‌త్స‌రాల నుంచి ఓపిగ్గా ఎదురు చూసింది. దాడి జ‌ర‌గ‌డానికి కొద్దివారాల ముందు అధ్య‌క్షుడు జో బైడెన్ కేబినెట్ అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీలు, నిఘా సంస్థ‌ల‌తో కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించారు. దాడి చేసే స‌మ‌యంలో కేవ‌లం జ‌వ‌హ‌రీనే ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని, ఇత‌రులెవ‌రికీ హాని జ‌ర‌గ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు.

జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డు

జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డు


జులై ఒక‌టోతేదీన సిచ్యువేష‌న్ రూమ్‌లో బైడెన్ ఈ ప్ర‌ణాళిక మొత్తం విన్నారు. గురువారం ఆప‌రేష‌న్ కు తుది మెరుగులు దిద్దిన తర్వాత అనుమ‌తి మంజూరు చేశారు. జ‌వ‌హ‌రీపై 25 మిలియ‌న్ డాల‌ర్ల రివార్డు ఉంది. జవ‌హ‌రీని హ‌త‌మార్చేందుకు అవ‌స‌ర‌మైన ఆయుధాన్ని ఎంపిక చేసుకోవ‌డానికి కూడా అమెరికా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఎక్క‌డా భారీగా పేలుళ్లు ఉండ‌కుండా చూసుకుంది. ఈ ఆప‌రేష‌న్ కోసం హెల్ ఫైర్ R9X మోడ‌ల్ క్షిప‌ణిని ఎంపిక చేసుకుంది.

 ఏమిటీ నింజా బాంబ్స్

ఏమిటీ నింజా బాంబ్స్

100 పౌండ్ల బ‌రువుండే ఈక్షిప‌ణిలో వార్‌హెడ్ ఉండ‌దు. కానీ దీనికి అత్యంత శ‌క్తివంత‌మైన ఆరు బ్లేడ్లు ఉంటాయి. ఇవి ల‌క్ష్యం మీద‌కు వెళ‌తాయి. ప్ర‌త్యేకంగా పేలుడు ఉండ‌దు. 2017లో తొలిసారి ఈ ఆయుధాన్ని అల్ ఖైదా సీనియ‌ర్ లీడ‌ర్ అబు బ‌క‌ర్ అల్ ఖ‌య‌ర్ అల్ మ‌స్రిపై అమెరికా ఉప‌యోగించింది. దాడి జ‌రిగే స‌మ‌యంలో మ‌స్రి సిరియాలోని ఓ న‌గ‌రంలో కారులో ప్ర‌యాణిస్తున్నాడు. ఈ దాడిలో కారు మ‌ధ్య‌భాగంలో మాత్ర‌మే రంధ్రం ప‌డిన‌ట్లు ఫొటోలు ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత కూడా అమెరికా ప‌లు ల‌క్ష్యాల‌పై దీంతో దాడులు నిర్వ‌హించింది. 2019లో జ‌మాల్ అల్ బ‌ద్వి అనే ఉగ్ర‌వాదిని కూడా అమెరికా ఇదే ఆయుధంతో మ‌ట్టుబెట్టింది. అత‌డు 2000 సంవ‌త్స‌రంలో అమెరికా నౌక యూఎస్ ఎస్ కోలేపై బాంబింగ్ చేశాడు. వీటిని నింజా బాంబ్స్ లేదా ఫ‌యింగ్ జిన్సూ అని పిలుస్తారు.
ఒబామా హ‌యాంలో సాధార‌ణ పౌరులు మ‌ర‌ణించ‌కుండా ఆప‌రేష‌న్లు నిర్వ‌హించేందుకు దీన్ని అభివృద్ధి చేశారు.

సిరాజుద్దీన్ హక్కానీ ఇల్లు

సిరాజుద్దీన్ హక్కానీ ఇల్లు


హక్కానీ నెట్ వర్క్ కీలకనేత సిరాజుద్దీన్ హక్కానీదిగా తెలుస్తోంది. ఆఫ్గ‌నిస్తాన్‌లో భార‌త్‌, అమెరికా పౌరుల‌పై దాడుల్లో హ‌క్కానీ నెట్ వ‌ర్క్ పాత్రే కీల‌కం. ప్ర‌స్తుతం తాలిబ‌న్ ఇంటీరియ‌ర్ మినిస్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జవహరీపై దాడి జ‌రిగిన వెంట‌నే నెట్ వ‌ర్క్ స‌భ్యులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. జ‌వ‌హ‌రీ కుటుంబ స‌భ్యుల‌ను మ‌రో ప్రాంతానికి త‌ర‌లించారు. ఇంటిపై దాడిజ‌రిగిన ప్ర‌దేశాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. ఆఫ్గ‌నిస్తాన్‌లో అత్యంత భ‌ద్ర‌త మ‌ధ్య ఉండే షిర్పూర్ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. తాలిబన్ కీల‌క నేత‌లంతా ఇక్క‌డే ఉంటారు.

English summary
A 100 pound missile has no warhead.But it has six extremely powerful blades
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X