ఇదేందబ్బా : బల్లిని మించిన స్పీడ్.. స్పైడర్‌లా దూకుడు.. యువతి రికార్డు బ్రేక్
ఇండోనేషియా : సహజంగా గోడమీద బల్లులు పాకుతుంటాయి. ఇక స్పైడర్ మ్యాన్‌ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. గోడ మీద బల్లులు అలా సరసరా పాకుతుంటే వాటి వేగం అంచనా వేయడం కుదరదు. అలాగే స్పైడర్లు కూడా గోడలు పాకడం చూస్తుంటే రెండు కళ్లు చాలవు. అదే క్రమంలో ఇండోనేషియాకు చెందిన ఓ యువతి గోడ అలా అలా స్పీడ్‌గా పాకుతూ రికార్డు బ్రేక్ చేయడం చర్చానీయాంశమైంది. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎరీస్ సుసంతి రహయు అనే ఇండోనేషియా యువతి వాల్ క్లైంబింగ్‌లో రికార్డు బద్దలు కొట్టింది. 15 మీటర్ల గోడను కేవలం 7 సెకన్ల లోపు సరసరా పాకేసింది. బల్లిని మించిన స్పీడ్‌లా.. స్పైడర్‌ను మించిన వేగంలా ఆ యువతి స్టన్నింగ్ యాక్షన్ చూసి అక్కడి వీక్షకులకు క్రీడానందం కలిగింది. అలా అలా పాకుతూ కేవలం 7 సెకన్ల లోపే 15 మీటర్ల ఎత్తున్న గోడ పైకి చేరడం అందర్నీ అబ్బురపరిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండంతో వారెవ్వా అంటున్నారు నెటిజన్లు.

స్పైడరే పాకుతుందా అనే రేంజ్‌లో అత్యంత వేగంగా 15 మీటర్ల గోడను పాకి పాత రికార్డులను తిరగరాసింది సుసంతి రహయు. చైనాలోని క్సియమెన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్ క్లైంబింగ్ (IFSC) పోటీలో పాల్గొని ప్రపంచ కప్ కొట్టేసింది. మహిళల విభాగంలో ఈ అథ్లెట్ సాధించిన సరికొత్త రికార్డు ఔరా అనిపిస్తోంది. 15 మీటర్ల గోడను 6.995 సెకన్లలో ఎక్కేసి పోటీదారులను తోసిరాజని రికార్డు బ్రేక్ చేసింది.
Women's speed climbing record was smashed. Under 7 seconds. Inhuman. pic.twitter.com/8EC1A1wE1O
— Mark Serrels (@Serrels) October 20, 2019
ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె చేతికి వేలి గాయమైన ఏమాత్రం లెక్క చేయలేదు. ఓన్లీ స్పోర్టివ్ మైండ్‌తో పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డును సొంతం చేసుకోగలిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను స్పైడర్‌వుమెన్‌గా పిలుస్తున్నారు. అంతేకాదు పోస్ట్ చేసిన క్షణాల్లోనే దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications