లైఫ్ పార్ట్నర్స్ కు షాక్: హెచ్ -4 వీసాల రద్దు యోచనలో ట్రంప్?
హెచ్ 1 బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వామ్యుకు ఇచ్చిన వర్క్ వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందనే ఆందోళన వ్యక్తమౌతోంది.
వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వామ్యుకు ఇచ్చిన వర్క్ వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసే ప్రయత్నాలు చేస్తోందనే ఆందోళన వ్యక్తమౌతోంది.
హెచ్ 1 బీ వీసాలు కల్గి ఉన్న వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ వీసాలు జారీ చేయాలని 2015లో అప్పటి అమెరికా సర్కార్ నిర్ణయం తీసుకొంది.దీంతో దాదాపుగా రెండు లక్షల మంది జీవిత భాగస్వామి వీసా (హెచ్ 4) పై అమెరికాలో నివసిస్తున్నారు.
వారిలో అధిక శాతం వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సర్కార్ నిర్ణయాన్ని 2015 లోనే కాలిఫోర్నియాలోకు చెందిన కొరందు ఐటీ ఉద్యోగులు కింది కోర్టులో దావా వేశారు. కేసును 2018 లో కింది కోర్టు కొట్టివేసింది.

తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఇంతలోనే ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చింది, దీంతో ఈ కేసులో సమాధానం చెప్పేందుకు తమకు 60 రోజలు గడువు కావాలని కోర్టును కోరింది.
ఈ గడువు సోమవారంతో ముగిసింది. విచారణను మరో ఆరుమాసాల పాటు ఆపాలంటూ వాషింగ్టన్ సర్క్యూట్ అప్పీల్ కోర్టును ట్రంప్ సర్కార్ కోరింది. 2015 నుండి హెచ్ 4 పేరిట జీవిత భాగస్వామ్యులకు వర్క్ వీసాలను ఇస్తున్నారు.
అయితే వీరిలో చాలా మందికి హెచ్ 1 బీ వీసా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి వీసా కోసం దానిని వదులుకొన్నారు.
దాదాపు 2 లక్షల మంది యువతులు జీవిత భాగస్వామి వీసాలపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధికశాతం మంది అక్కడే స్థిరపడ్డారు. అయితే విదేశీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ హెచ్ 4 వీసాలను రద్దు చేయడంపై దృష్టి సారించిందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.












Click it and Unblock the Notifications