ఫేస్‌బుక్‌లో బాలిక ఫోన్ నెంబర్‌తో పాటు సెక్స్ వీడియో
లండన్: ఓ అమ్మాయిపై కక్ష పెంచుకున్న ఓ యవకుడు ఫేస్‌బుక్‌లో ఆమె ఫోన్ నెంబర్‌తో పాటు సెక్స్ వీడియోతో కలిపి పోస్ట్ చేసిన ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అంతేకాదు 'మీరు ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే.. ఆమె మీతో సెక్స్‌లో పాల్గొంటుంది' అని ఆ ఫేస్‌బుక్ పోస్టులో రాశాడు.
దీంతో కేసు బ్రిటన్‌లోని మాంచెస్టర్ మిన్షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు ఎదుటకు ఇటీవలే విచారణకు వచ్చింది. ఫేస్‌బుక్‌లో ఈ అభ్యంతరకర పోస్టును పోస్ట్ చేసిన యువకుడిని 18 ఏళ్ల షాన్ స్టాట్‌గా గుర్తించారు. ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో 'హాయ్' అని మాట కలిపి.. ఆ తర్వాత తనను కలిసేందుకు రావాల్సిందిగా కోరాడు.
అందుకు ఆమె నుంచి బదులు రాకపోవడంతో చికాకు పడిన అతను అసభ్యకర ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి అవి నీవేనని అంటానని ఆ అమ్మాయిని బెదిరించాడు. దీంతో ఆ బాలిక అతడిని ఫేస్‌బుక్ చాట్‌లో బ్లాక్ చేసింది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న షాన్ స్టాట్ ఆ బాలిక ఫోన్ నంబర్‌ను ఓ సెక్స్ వీడియోతో కలిపి పోస్టు చేశాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ పోస్టు చేసిన వెనువెంటనే బాలికకు 25 నుంచి 30 వరకు కాల్స్ వచ్చాయని బాధితురాలి తన ఫిర్యాదులో పేర్కొందని కోర్టుకు న్యాయవాది నివేదించారు. అయితే తన క్లయింట్ స్టాట్‌కు ఇంకా మానసిక పరిణితి రాలేదని, అతను 10, 13 ఏళ్ల వాడిలాగా ప్రవర్తించాడని షాన్ స్టాట్ తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఈ కేసులో వాదోపవాదనలు విన్న జడ్జి బాలిక ఫోన్ నెంబర్‌తో పాటు సెక్స్ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నిందితుడు స్టాట్ యువ నేరస్తుల గృహంలో నాలుగేళ్ల శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. అంతేకాకుండా అతని పేరును లైంగిక నేరస్తుల జాబితాలో ఉంచాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications