పెళ్లాడ్తావా: స్నోడెన్‌ను బుట్టలో వేసేందుకు సెక్సీ 'రష్యన్' స్పై
హైదరాబాద్: ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికాను గడగడలాడించిన విషయం తెలిసిందే. అలాంటి స్నోడెన్‌ను రష్యా బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించిందట. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన కేజీబీ మాజీ గూఢచారి ఒకరు వెల్లడించారు. తమకు బద్దశత్రువైన అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న స్నోడెన్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు రష్యా మహిళా గూఢచారిని ప్రయోగించిందంట.
ఇందుకోసం సెక్సీ గూఢచారిని ప్రయోగించారు. ఆమె పేరు అన్నా చాప్‌మన్. ఈ విషయాన్ని మాజీ గూఢచారి బోరిస్ కార్పిచ్ కోవ్ తెలిపారు. అధికారుల ఆదేశంతో రంగంలోకి దిగిన ఆ ముద్దుగుమ్మ అతడిని ఒక్కసారి కలిసింది. అంతేకాదు.. పెళ్లి ప్రతిపాదన కూడా చేసింది.
స్నోడెన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. అయితే, ఇదంతా ప్లాన్‌లో భాగంగా జరిగిందని ఆ మాజీ చెప్పాడు. అన్నా చాప్‌మన్ ప్రతిపాదనను స్నోడెన్ అంగీకరిస్తే రష్యా పౌరసత్వం తీసుకునేందుకు అర్హుడవుతాడని, తద్వారా అతను శాశ్వతంగా రష్యాలో ఉండిపోవాల్సి రావొచ్చునని, పౌరసత్వం వచ్చి, విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అతను వివరించాడు.

కాగా, స్నోడెన్‌కు చేసిన పెళ్లి ప్రతిపాదన పైన స్పందించేందుకు అన్నా చాప్‌మన్ ఓ ఇంటర్వ్యూలో నిరాకరించింది. రష్యా దౌత్యవేత్త కూతురు అయిన అన్నా చాప్‌మన్ 2010లో వార్తల్లోకి వచ్చింది. ఆమె వయస్సు 32. స్నోడెన్ వయస్సు 31.
రష్యా ఏజెంటుగా అమెరికాలో పని చేశానని అన్నా చాప్‌మన్ చెప్పి గతంలో సంచలనం సృష్టించారు. గూఢచారి అని బయటి ప్రపంచానికి తెలియకముందు ఆమె న్యూయార్క్ సిటీలో రియల్ ఎస్టేట్ ఏజెంటుగా పని చేసింది. అమెరికా నుండి తిరిగి వచ్చాక మోడల్‌గా పని చేసింది.
అమెరికాను గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా అతనికి ఆశ్రయం ఇచ్చింది. మూడున్నరేళ్లు రష్యాలో ఉండేందుకు అతనికి అనుమతి ఇచ్చింది. కాగా, అన్నా చాప్‌మన్ పెళ్లి ప్రతిపాదన తెచ్చినప్పటికీ స్నోడెన్ మాత్రం జరగబోయే పరిణామాల పైనే దృష్టి సారించాడట.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications