పాకిస్తాన్ నీచ బుద్ధి బట్టబయలు..!!
మిత్రదేశాలకు మోసం చేయడంలో పాకిస్తాన్ హద్దులు దాటింది. గతంలో టర్కీ విషయంలో చూపిన నిర్లక్ష్యం, విపత్తు సహాయం పేరుతో చేసిన మోసాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు తుఫాను ప్రభావిత శ్రీలంకకు గడువు ముగిసిన ఆహార పదార్థాలు, మందులను పంపించింది. మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలపాలైంది. ఈ ఘటన- పాకిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, దౌత్యపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
శ్రీలంకకు 'మానవతా సహాయం' పేరుతో పాకిస్తాన్ పంపిన సహాయ సామగ్రిలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉండటం తీవ్ర కలకలం సృష్టించింది. పాకిస్తాన్ హైకమిషన్ స్వయంగా విడుదల చేసిన ఫొటోల ద్వారానే ఈ మోసం బట్టబయలైంది. ప్యాక్ చేసిన నీళ్లు, పాలు, బిస్కెట్లు వంటి వాటిపై గడువు తేదీ అక్టోబర్ 2024 అని స్పష్టంగా ముద్రించి ఉంది. అనేక కార్టన్‌లలోని వస్తువుల గడువు తేదీలు ముగిసిపోయాయి. ఇది శ్రీలంక విపత్తు నిర్వహణ, విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆందోళనకు గురి చేసింది.

దీనికి సంబంధించిన ఫొటోలు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా యూజర్లు పాకిస్తాన్ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 10 కుటుంబాలకు కూడా సరిపోని పరిమాణంలో.. పైగా గడువు ముగిసిన ఆహారాన్ని పంపడం పట్ల మండిపడుతున్నారు. ఇది పాకిస్తాన్ నీచమైన బుద్ధిని తెలియజేస్తోందని ఆరోపించారు. గతంలో భూకంపం వచ్చిన హిందూ-మెజారిటీ దేశమైన నేపాల్ కు బీఫ్ పంపిన ఘటనను కూడా ఒక యూజర్ గుర్తు చేసుకున్నారు.
ఈ చర్య పాకిస్తాన్ దివాళా కోరు స్థితికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓ దేశాన్ని, అక్కడి ప్రజలను అవమానించినట్లుగా, పాకిస్తాన్ సహాయక చర్యలనేవి ఓ జోక్ గా మారిందని మండిపడ్డారు. అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుతో శ్రీలంక పోరాడుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన తెలియజేసింది. ఇటువంటి చర్యలు సమర్థనీయం కావని పేర్కొంది.
Always standing together! 🇵🇰❤️🇱🇰
— Pakistan High Commission Sri Lanka (@PakinSriLanka) November 30, 2025
Relief packages from Pakistan have been successfully delivered to assist our brothers and sisters affected by the recent floods in Sri Lanka which signifies our unwavering solidarity.
PAKISTAN STANDS WITH SRI LANKA TODAY AND ALWAYS.
#FloodRelief pic.twitter.com/rMhMwUhEA8
పాకిస్థాన్ రిలీఫ్ సరఫరాలు వివాదాలకు కారణం కావడం ఇది మొదటిసారి కాదు. 2015లో నేపాల్ భూకంపం సమయంలో.. ఆ హిందూ మెజారిటీ దేశానికి బీఫ్ ఆధారిత రెడీ-టు-ఈట్ భోజనాలను పంపినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కాగా- దిత్వా తుఫాన్ ధాటికి శ్రీలంక అల్లాడుతోంది. వరదలు ముంచివేశాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. మొత్తం 25 జిల్లాల్లో 366 మందికి పైగా మరణించారు. 400 మంది గల్లంతయ్యారు. కోటి మందికి పైగా ప్రభావితం అయ్యారు. వేలాది ఇళ్ళు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు-ఈ జిల్లాలకు అలర్ట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications