శ్రీశ్రీ రవిశంకర్‌కు పెరూ అత్యున్నత పురస్కారం
హూస్టన్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ విద్యతో సమాజంలో మానవ విలువలు పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్న అధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ను పెరూ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘మెడెల్లా డి లా ఇంటిగ్రేసియన్ ఎన్ ఎల్ గ్రేడో డీ గ్రన్ ఆఫీసియల్' సత్కరించింది.
అండియాన్ పార్లమెంట్, పెరూ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును రవిశంకర్‌కు అందజేశారు. హింస, ఒత్తిడుల నుంచి ప్రపంచాన్ని విముక్తం చేయడానికి అందరు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని రవిశంకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా వేలాది మంది పెరూలో ప్రయోజనం పొందుతున్నారని సంస్థ పెరూ ప్రతినిధి పేర్కొన్నారు.
పెరూలో హింసా, అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో పలు యూనివర్సిటీలు, కంపెనీలు, ఇతర సంస్థల్లో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరగతులకు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.












Click it and Unblock the Notifications