స్టార్ వార్ నటుడిని కబళించిన కరోనా వైరస్, పాజిటివ్‌తో ఆండ్రూ జాక్ మృత్యువాత

ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ లండన్‌లో చనిపోయారు. కరోనా పాజిటివ్‌తో అతను సర్రే ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారని అతని మేనేజర్ జిల్ మెక్ కల్లౌ మీడియాకు తెలిపారు. స్టార్ వార్ యాక్టర్‌గా ఆండ్రూ మంచి పేరు గడించారు.

థేమ్స్ నదిబోడ్డున గల పురాతన ఇంటిలో జాన్ ఆండ్రూ నివసిస్తున్నారు. జాన్ ఆండ్రూకు పెళ్లైంది.. కానీ భార్యతో విడిగా ఉంటున్నారు. స్టార్ వార్ ఎపిసోడ్ యైట్- ద లాస్ట్ జెడి యాస్ జనరల్ ఎమ్మాట్, ఆజ్ వెల్ ఆజ్ సోలో, ఆ స్టార్ వార్స్ స్టోరీ అండ్ స్టార్ వార్స్ ఎపిసోడ్ సెవెన్‌లో నటించారు.

Star Wars actor Andrew Jack dies of coronavirus..

ఆండ్రూ జాక్ భార్య గ్యాబ్రియెల్ రోజర్స్ ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆండ్రూ జాక్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు రెండురోజుల క్రితం నిర్దారణ అయ్యిందని ఆమె తెలిపారు. వైరస్ సోకిందనే బాధ అతనిలో కనిపించలేదని చెప్పారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అతని జ్ఞాపకాలతో తాము ఉన్నామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వచ్చినవారిని రెండువారాలపాటు హోటల్‌లో నిర్బంధిస్తున్నారు.

జ్వరం, దగ్గుతో కరోనా లక్షణాలు ప్రారంభవుతోన్న సంగతి తెలిసిందే. శ్వాసకోశాలపై ప్రభావం చూపి న్యూమెనియాకు దారితీసింది. వైరస్ ప్రభావం ఎక్కువై.. మరణం సంభవిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+