విమానాన్ని ఎత్తుకెళ్లిన మెకానిక్, వెంటాడిన ఎఫ్15 యుద్ధవిమానాలు, కూలిపోయింది
వాషింగ్టన్: ఎత్తుకెళ్లిన ఓ విమానం ఓ చిన్న దీవిలో కూలిపోయింది. ఈ సంఘటన అమెరికాలోని టకోమా విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ఓ ఎయిర్ లైన్ మెకానిక్ విమానాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సైన్యం వెంటపడగా అతను తప్పించుకునే క్రమంలో విమానాన్ని ఇష్టం వచ్చినట్లు నడిపాడు. దీంతో విమానం గిరాగిరా తిరిగి కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణీకులెవరూ లేరు.
అధికారుల అనుమతి లేకుండానే జంట ఇంజిన్లుగల విమానం ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రయాణికులు లేరు. తొలుత ఉగ్రవాదులు దీన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని భావించారు. వెంటనే రెండు ఎఫ్ 15 యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అవి వెంబడిస్తుంటే ఆ మెకానిక్ విమానాన్ని భయానకంగా నడిపాడు. నీటిపై నుంచి సమీప ఎత్తు నుంచి దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్లో వైరల్ అయ్యాయి.

చివరగా ఓ దీవిలోలో కూలింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని తేల్చారు. విమానాన్ని స్థానిక మెకానిక్ ఎత్తుకెళ్లాడని, అతడిలో ఆత్మహత్య చేసుకోవాలనే భావనలు కనిపిస్తున్నాయని, ఒంటరిగానే అతడు ఈ పని చేశాడని, రాత్రి ఎనిమిది గంటలకు విమానాన్ని అతడు ఎత్తుకెళ్లాడని, గంటన్నర తర్వాత కూలిందని చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications