తీరు మార్చుకోవాల్సిందే... ఇకపై అలా కుదరదు... మీనా హ్యారిస్‌పై వైట్ హౌస్ ఆగ్రహం...

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ వ్యవహార శైలి పట్ల వైట్ హౌస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యక్షురాలిగా కమలకు ఉన్న ఇమేజ్‌ను మీనా తన సొంత బ్రాండ్‌ ప్రమోషన్‌కు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో కమలా హ్యారిస్‌కు మీనా క్యాంపెయిన్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించారు. కమలతో పనిచేసిన నేపథ్యం,ఆమెతో ఉన్న బంధుత్వం రీత్యా సహజంగానే మీడియాలో మీనాకు ప్రాధాన్యం లభిస్తోంది. అయితే కమలతో ఉన్న అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని మీనా తన బిజినెస్,బుక్స్,ఇతరత్రా ప్రొడక్ట్స్‌‌ను ప్రమోట్ చేసుకుంటున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మీనా బ్రాండ్స్‌లో కమల పేరు...

మీనా బ్రాండ్స్‌లో కమల పేరు...

లాస్ ఏంజెల్స్ టైమ్స్ కథనం ప్రకారం... మీనా హ్యారిస్ సొంతంగా ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. దాని ద్వారా టీషర్టులు,స్వెట్ షర్ట్స్‌ను విక్రయిస్తోంది.అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ కోసం పనిచేసిన మీనా హ్యారిస్... ఆ సమయంలో కమల చేసిన నినాదాలు,ఆమె ఫోటోలను తన సొంత బ్రాండ్స్‌ కోసం వాడుకుంటోంది. వాటిని తన బ్రాండ్ ప్రమోషన్‌కు సంబంధించిన వీడియోల్లో ఉపయోగిస్తోంది. టీషర్టులు,బుక్స్‌పై ముద్రిస్తోంది. ఒక టీషర్ట్‌పై 'వైట్ ప్రెసిడెంట్ ఆంటీ' అనే లైన్‌ను ముద్రించారు.ఇలా కమలా హ్యారిస్‌కు ఉన్న ఇమేజ్‌ను ఇలా తన వ్యక్తిగత ఇమేజ్ కోసం మీనా హ్యారిస్ వాడుకోవడంపై వైట్ హౌస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

నిధి అగర్వాల్ మోస్ట్ గ్లామరస్ ఫోటోలు... లేటేస్ట్ ఫోటోషూట్

కమలా స్లోగన్స్‌ని కూడా వాడుకుంటున్న మీనా...

కమలా స్లోగన్స్‌ని కూడా వాడుకుంటున్న మీనా...

ఇటీవల మీనా హ్యారిస్ తన బుక్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి భారీ ఎత్తున కవరేజీ లభించింది. కమలా హ్యారిస్‌తో ఉన్న బంధుత్వం కారణంగానే ఆమె మీడియాలో హైలైట్ అవుతున్నారని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మీనా 'కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా' పేరుతోనూ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇటీవల డిజైనర్ హెడ్ ఫోన్స్ ప్రొడక్ట్స్‌ను కూడా లాంచ్ చేసిన మీనా... దాని ప్రమోషన్ కోసం కమలా హ్యారిస్ ఎన్నికల నినాదమైన 'ది ఫస్ట్ బట్ నాట్ ది లాస్ట్' సెంటెన్స్‌ను వాడుకున్నారు.

Recommended Video

    Mia Khalifa మద్దతు రైతులకే.. తీవ్రంగా స్పందించిన భారత్ | Rihanna | Greta Thunberg
    తీరు మార్చుకోవాలి : వైట్ హౌస్

    తీరు మార్చుకోవాలి : వైట్ హౌస్

    ఇప్పటివరకూ మీనా హ్యారిస్ తన వ్యాపారాల్లో గానీ ఇతరత్రా విషయాల్లో గానీ ఎక్కడా ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. అయితే ఇప్పుడున్న ఎథిక్స్ రూల్స్ ప్రకారం.. కమల పేరును మీనా తన ప్రొడక్ట్స్‌పై ముద్రించడం లేదా తన ప్రమోషన్‌కు వాడుకోవడం సరికాదని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. కమలా హ్యారిస్ ప్రస్తుతం ఉపాధ్యక్ష హోదాలో ఉన్నందునా... ఇకపై ఆమె పేరును వాడుకోవద్దని సూచిస్తున్నాయి. ఇది సరైన ధోరణి కాదని... ఆమె తన తీరును మార్చుకోవాలని పేరు వెల్లడించేందుకు ఇష్టపడి ఓ వైట్ హౌస్ అధికారి అభిప్రాయపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+