అంత్యక్రియల్లో దిగంబర నృత్యాలు: నిషేధం
హందన్ (చైనా): రుడాలిల గురించి వినే ఉంటారు. మన దేశంలో ఎవరైనా చనిపోతే ప్రత్యేకంగా విలపించడానికి రుడాలిలను పిలిపిస్తారు. అయితే, చైనాలో మాత్రం ఎవరైనా చనిపోతే విషాదాన్ని మాయం చేసి, వారిని ఉల్లాసపరచడానికి చైనాలో ఓ ప్రత్యేకమైన కళాకారుల బృందం ఉంది.
అంత్యక్రియల్లో ఆ కళాకారులు బృందం దిగంబరంగా నృత్యాలు చేస్తూ బాధితులను ఉల్లాసపరుస్తారు. ఇటీవల జరిగిన అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు చైనాలో హల్‌చల్ చేశాయి. జియాంగ్సు ప్రాంతంలోని మృతుడి కుటుంబసభ్యుల ముందు ఒంటిపైనున్న బట్టలు విప్పుతూ నృత్యకారులు దిగంబరంగా మారడంపై చైనా సాంస్కృతికశాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది.

స్థానిక సంస్కృతిని కలుషితం చేస్తున్న ఇలాంటి నృత్యాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనాలో ఇలాంటి కళాకారులు 2 వేల మందికి పైనే ఉంటారని, వారి ప్రదర్శన ఒక్కంటికి సుమారు 325 డాలర్లు చెల్లిస్తుంటారని సమాచారం.
చైనా గ్రామీణ ప్రాంతాల్లో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి, వారిని గౌరవించడానికి దిగంబర నృత్యాలను ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వినోద వాణిజ్యానికి సంబంధించిన అవి సాంస్కృతిక విలువలను విచ్ఛిన్నం చేస్తున్నాయని చైనా అధికారులు అంటున్నారు. అది అనాగరికమని వ్యాఖ్యానిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications