ఇండోనేషియాలో 6.9తీవ్రతతో భూకంపం: జనం పరుగులు
జకార్తా: ఇండోనేషియాలోని అంబన్ ద్వీపం సమీపంలోని సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. ఆ ద్వీపానికి 174 కిలోమీటర్ల దూరంలో ఉత్తర బండా సముద్రంలో 20కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉంది.
రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్‌జిఎస్) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.21 ప్రాంతంలో అక్కడ భూమి కంపించింది.

అయితే ముందు 7.1 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించిందని చెప్పిన యూఎస్‌జిఎస్ కొంత సేపటికే 6.9కి సవరించింది. భూకంపం కారణంగా ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు.
కాగా, ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు వార్తలు అందలేదు. దీని ప్రభావం వల్ల సమీప దేశమైన ఆస్ట్రేలియాకు సునామీ ప్రమాదం ఏమీ లేదని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, స్వల్ప సునామీ వచ్చే అవకాశముందని సిస్మోలజిస్టులు చెబుతున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications