సెంట్రల్ మాడ్రిడ్‌లో పేలుడు.. కుప్పకూలిన భవంతి... సోషల్ మీడియాలో వీడియో
స్పెయిన్‌లో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మాడ్రిడ్‌లో ఒక భవనం కూలిపోయింది. ఎందుకు కుప్పకూలిందో తెలియరాలేదు. భవనం కూలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే స్పానిష్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రంగంలోకి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భవనం కూలడంతో వృద్దులు సమీపంలో గల నర్సింగ్ హోంకు తరలించారు.

భవనం కూలిన స్థలానికి 9 ఫైరింజన్లు, 11 అంబులెన్సులు చేరుకున్నాయి. లోపల ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి హాహాకారాలు మాత్రం వినిపిస్తున్నాయి. భవనం ఎలా కూలిపోయిందనే విషయం తెలియరాలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications