ఫిలిప్పీన్స్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం: పివోల్క్‌కు సునామీ హెచ్చరిక
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని పొందగిటాన్‌లో గురువారం భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7.1 తీవ్రతగా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత రద్దు చేసినట్లు తెలిసింది. కాగా, ఫిలిప్పీన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేశాయి.

అయితే, భూకంపం తర్వాత జరిగిన నష్టం గురించి ముందస్తు నివేదికలు ఏమీ లేవు. కాగా, ఫివోల్క్స్ దేశానికి సునామీ ముప్పు ఉందని కూడా చెప్పారు, యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్, హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ యుఎస్ వెస్ట్ కోస్ట్ లేదా హవాయికి కూడా సునామీ ప్రమాదం లేదని చెప్పారు. ఫిలిప్పీన్స్ భౌగోళికంగా చురుకైన పసిఫిక్ రింగ్‌లో ఉంది, తరచుగా భూకంపాలు ఎదుర్కొంటుంది.












Click it and Unblock the Notifications