యూఎస్: స్కూల్‌లో మాజీ భర్త కాల్పులు: టీచర్‌తోపాటు 8ఏళ్ల విద్యార్థి, మరో వ్యక్తి మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నాడినో నగరంలో ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెబడ్డాడు. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నాడినో నగరంలో ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెబడ్డాడు. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు.
కాల్పుల్లో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇందులో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన అనంతరం దుండగుడు తనని తాను కాల్చేసుకున్నాడు. నిందితుడు కాల్పుల్లో చనిపోయిన ఉపాధ్యాయురాలి మాజీ భర్తగా పోలీసు అధికారులు గుర్తించారు.

మాజీ భార్యపై పగ తీర్చుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు. సహాయచర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం కావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications