నివాసాల మధ్య కూలిన విమానం.. 46 మంది మృతి
సూడాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నివాసాల మధ్య ఓ సైనిక విమానం కూలడంతో 46 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా.. కర్రారి జిల్లాలోని ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని బుధవారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని మిలిటరీ అధికారులు చెప్పారు. దాదాపు రెండేళ్ల నుంచి సూడన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ మిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ -ఆర్ఎస్ఎఫ్ దళాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా చాలా పట్టణ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.

ఇటీవల కాలంలో ఈ యుద్ధం మరింత ఉద్రక్తంగా మారింది. ఆర్ఎస్ఎఫ్ దళాలపై సూడాన్ మిలిటరీ విరుచుకుపడుతోంది. డార్ఫర్ పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించే ఆర్ఎస్ఎఫ్, నైలా ప్రాంతంలో సోమవారం తాము ఒక సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించడం గమనార్హం.
మరోవైపు, ఈ ప్రాంతంలో సామూహిక అత్యాచారాలు, జాతిరంగా ప్రేరేపితమైన హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యకం చేశాయి. ఇవి యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలని పేర్కొన్నాయి. డార్నర్ ప్రంంలో ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications