గాల్లో వేలాడుతోంటే,జుట్టుపట్టుకొని భార్యను ఇలా...చివరికిలా అలా..
ఏడంతస్థుల భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించిన భార్యను జుట్టుపట్టుకొని కాపాడాడు ఓ భర్త. ఈ ఘటన చైనాలో చోటుచేసుకొంది.
చైనా:భార్య, భర్తల మధ్య గొడవలు జరగడం సహజమే. గొడవలు పెట్టుకొని తిరిగి కలిసి ఉంటారు.అయితే చైనాలో నివసిస్తోన్న దంపతులు తీవ్రంగా గొడవ పడ్డారు.అయితే భర్తతో గొడవ పడిన భార్య ఆత్మహత్యచేసుకొనేందుకుగాను ఏడంతస్తుల భవనం పై నుండి దూకింది.అయితే ఆమె జుట్టు పట్టుకొని భర్త రక్షించాడు.
క్షణికావేశానికి లోనై అనేకమంది ప్రాణాలు తీసుకొంటుంటారు.అయితే తృటిలో ప్రాణాపాయం నుండి తన భార్యను రక్షించాడు ఓ భర్త.
షాంగ్జీలోని ఓ ఏడంతస్తుల భవనంలోని చివరి ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు కాంగ్ ,లీయూ దంపతులు.భార్య, భర్తల మధ్య చిన్న వివాదం చోటుచేసుకొంది. అయితే ఈ వివాదం పెరిగి పెద్దదిగా మారింది.భార్య, భర్తలు మధ్య మాటల యుద్దం సాగింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య కాంగ్ ఆత్మహత్య చేసుకొంటానని చెప్పి ఏడంతస్థుల భవనం నుండి కిందకు దూకింది.అయితే భార్య వెంటే పరుగెత్తుకొచ్చిన భర్త ఆమెను రక్షించాడు.
కాంగ్ ఏడంతస్థుల మేడ నుండి కిందకు దూకగానే ఆమె భర్త లీయూ ఆమె వెంటే పరుగెత్తుకెళ్ళి ఆమె జుట్టు పట్టుకొన్నాడు. ఆమె గాల్లో వేలాడింది.
ఆమె జుట్టును పట్టుకొని లీయూ రక్షించాడు.తనకు బతికే ఆశలేదు చావనివ్వాలంటూ కాంగ్ భర్తను కోరింది. అయితే భార్య జుట్టు పట్టుకొని లీయూ రక్షించడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే కాంగ్ ను అరగంటపాటు ఆయన అలాగే గట్టిగా పట్టుకొన్నాడు. ఈ లోపుగా పోలీసులు అక్కడికి వచ్చి కాంగ్ ను రక్షించారు.ఈ ఘటనలో ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి. మనిషి జుట్టుకు సుమారు 12 టన్నుల బరువును ఆపే శక్తి ఉంటుందని , ఇది కూడ కాంగ్ ప్రాణాలు కాపాడడంలో దోహదపడిందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications