ఎయిర్ పోర్టులో ఆత్మహత్యాయత్నం
లండన్: లండన్ లో ప్రసిద్ది చెందిన విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు కత్తితో పోడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సాటి ప్రయాణికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టులో గురువారం వేకువ జామున ఓ ప్రయాణికుడు ఐదో టెర్మినల్ వద్ద ఉన్న ఓ షాప్ దగ్గరకు వెళ్లాడు. తరువాత జోబులో ఉన్న కత్తి తీసుకుని తన తల మీద పొడుచుకుని కుప్పకూలిపోయాడు.

విషయం గుర్తించిన సాటి ప్రయాణికులు ఎయిర్ పోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతనిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని అతను కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, అతని మీద వేరేవారు హత్యాయత్నం చేసే అవకాశం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. అతనే స్వయంగా కత్తితో పోడుచుకున్నాడని షాప్ యజమాని, ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications