24 గంటల్లో రెండో పేలుడు: విమానాశ్రయం వద్ద పేలుడు
కాబూల్‌లో ఉగ్రదాడిని మరువక ముందే ఆఫ్గనిస్థాన్‌లో మరో దాడి జరిగింది. కాబూల్‌కు తూర్పున 120 కి.మీ. దూరంలో ఉన్న జలాలాబాద్‌లోని విమానాశ్రయం బయట గురువారం ఉదయం కారులో ఉండి బాంబును పేల్చారు.
జలాలాబాద్: కాబూల్‌లో ఉగ్రదాడిని మరువక ముందే ఆఫ్గనిస్థాన్‌లో మరో దాడి జరిగింది. కాబూల్‌కు తూర్పున 120 కి.మీ. దూరంలో ఉన్న జలాలాబాద్‌లోని విమానాశ్రయం బయట గురువారం ఉదయం కారులో ఉండి బాంబును పేల్చారు.
ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందాడు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ బాంబును పేల్చినట్లు నాన్‌ఘర్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు.

దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆఫ్గనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరగడం 24 గంటల్లో ఇది రెండోసారి. నిన్న ఉదయం కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 90 మందికిపైగా మృతిచెందగా, 400 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications