Sultan of Brunei:అతిపెద్ద ప్యాలెస్,7వేల కార్లు..ఇవెక్కడి ఆస్తులురా నాయనా..!!

Sultan of Brunei:ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన ప్రారంభమైంది. బ్రూనైలో ల్యాండ్ అయిన వెంటనే ప్రధాని మోదీకి క్రౌన్ ప్రిన్స్ హజీ అల్-ముహ్తాదీ బిల్లా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ బ్రూనై త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఒక భారత ప్రధాని బ్రూనై దేశంకు తొలిసారిగా పర్యటిస్తుండటంతో ఆ దేశం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ బ్రూనై దేశం ఎక్కడుంది..? అక్కడి ప్రజలు ఏ భాష మాట్లాడతారు.. ఆ దేశ చక్రవర్తి ఆస్తులేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సిరిసంపదలకు కేరాఫ్ బ్రూనై సుల్తాన్

బ్రూనై దేశం... ఆ దేశానికి చక్రవర్తి సుల్తాన్ హస్సనల్ బోల్కియా. రెండవ ఎలిజిబెత్ రాణి తర్వాత ఒక దేశాన్ని సుదీర్ఘకాలం పాటు చక్రవర్తిగా పాలిస్తూ రికార్డు సృష్టించారు సుల్తాన్ హస్సనల్ బోల్కియా.ఇక ఆయన ఆస్తుల గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చిన్న దేశమే అయినప్పటికీ సిరిసంపదలకు ఏమాత్రం లోటు లేని దేశంగా బ్రూనై గుర్తింపు పొందింది. ఇక సుల్తాన్ లైఫ్ స్టయిల్ చూస్తే మామూలుగా ఉండదు. కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రపంచంలోనే ఎవరి వద్ద లేనంతగా ఈ చక్రవర్తి వద్ద కారు కలెక్షన్ ఉంది. దాదాపగా 7000 విలాసవంతమైన కార్లు ఈయన సొంతం. వాటి విలువ 5 బిలియన్ డాలర్లు.

Sultan of Brunei With 7 000 Cars to Host PM Modi
బ్రూనై చక్రవర్తికి 7వేల కార్లు

ఇక బ్రూనై చక్రవర్తి సుల్తాన్ హస్సనల్ బోల్కియా ఆస్తుల విలువ అక్షరాల 30 బిలియన్ డాలర్లు. ఏంటి షాకయ్యారా.. ఇలాంటివి షాకులు ఇంకా ఉన్నాయి. ఈ ఆదాయం లేదా ఆస్తులు మొత్తం ఎక్కువగా సంపాదించింది బ్రూనై దేశంలోని చమురు గ్యాస్ నిల్వల నుంచే. ఇక 7000 కార్లలో 600 రోల్స్ రాయిస్ కార్లుండటంతో ఈ చక్రవర్తి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఇక ఇతర కార్ల వివరాల విషయానికొస్తే...450 ఫెరారీ కార్లు, 380 బెంట్లేస్,పోర్షే,లాంబోర్గినీ, మేబాక్, జాగ్వార్,బీఎండబ్ల్యూ,మెక్లారెన్స్ లాంటి విలాసవంతమై కార్లు ఉన్నట్లు సమాచారం.

Sultan of Brunei With 7 000 Cars to Host PM Modi

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్యాలెస్

బ్రూనై రాజు వద్ద ఉన్న కార్ల కలెక్షన్లలో బెంట్లీ ఎస్‌యూవీ మోడల్స్ మొత్తం ధర 80 మిలియన్ డాలర్లు కాగా రాల్స్ రాయిస్ సిల్వర్ స్పర్-II పై 24 క్యారెట్ల బంగారు తాపడం ఉంటుంది. ఓపెన్ రూఫ్ పై ఒక గొడుగు ఉండేలా తానే స్వయంగా డిజైన్ చేయించుకున్నాడు. ఈ గొడుగుకు బంగారం తాపడం ఉంటుంది.2007లో తన కూతురు యువరాణి మజెదేదా వివాహానికి బంగారం తొడుగుతో కూడిన రోల్స్ రాయ్స్ కారు కొనుగోలు చేశారు.అయితే తనకున్న సంపదలో ఈ కార్ల కలెక్షన్లు ఇసుమంత అని చెప్పొచ్చు.

Sultan of Brunei With 7 000 Cars to Host PM Modi

ఇక బ్రూనై సుల్తాన్ నివాసముంటున్న ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్‌గా గుర్తింపబడింది.ఇది 2మిలియన్ చదరపు అడుగులలో నిర్మితమైంది. ఈ నిర్మాణంలో 22 క్యారెట్ల బంగారం కూడా అక్కడక్కడ వినియోగించారు. ఈ ప్యాలెస్‌లో ఐదు స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్‌రూంలు,257 స్నానపు గదులు,100 గ్యారేజీలు ఉన్నాయి.ఇక సుల్తాన్‌కు ప్రైవేట్ జంతుశాల కూడా ఉంది.ఇందులో 30 బెంగాల్ టైగర్లు,వివిధ జాతులకు చెందిన పశుపక్ష్యాదలున్నాయి. ఇక బోయింగ్ 747 సొంత విమానం కూడా సుల్తాన్‌కు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+