వీకెండ్ రద్దీ వేళ..పేలిపోయిన సూపర్ మార్కెట్- 23 మంది స్పాట్ డెడ్ మృతదేహాలు చెల్లాచెదురు
మెక్సికో సిటీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హెర్మోసిల్లో సిటీ సెంటర్‌లో ఉన్న ఓ సూపర్ మార్కెట్ లో భారీ పేలుడు సంభవించింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 మందికి పైగా మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. ఈ ఘటన పట్ల సోనోరా స్టేట్ గవర్నర్ అల్ఫోన్సో దురాజో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్రమైన, పారదర్శకమైన దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు.
మెక్సికో ప్రస్తుతం "డే ఆఫ్ ది డెడ్" పండుగను జరుపుకుంటోంది. మరణించిన తమ కుటుంబ సభ్యులను స్మరించుకోవడం ఈ పండగ ముఖ్య ఉద్దేశం. భారత్ లో ఆల్ సోల్స్ డే తరహాలో మెక్సికోవాసులు డే ఆఫ్ ది డెడ్ ను జరుపుకొంటారు. సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడి సూపర్ మార్కెట్లు రద్దీతో నిండిపోయాయి. మరణించిన వారికి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసే వారితో నిండిపోయాయి.

ఈ పరిస్థితుల మధ్య ఈ దుర్ఘటన సంభవించింది. మెక్సికో ఉత్తర ప్రాంతంలో గల హెర్మోసిల్లో సిటీ సెంటర్ లో గల సూపర్ మార్కెట్ లో ఈ పేలుడు సంభవించింది. తొలుత దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. సూపర్ మార్కెట్ లో ఉంచిన కొన్ని కెమికల్స్ కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో 23 మంది సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందినే వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెడ్ క్రాస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. స్టేట్ అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ మాట్లాడుతూ, ఫోరెన్సిక్ మెడికల్ సర్వీస్ రిపోర్టుల ప్రకారం- చాలామంది విషవాయువులను పీల్చడం వల్ల మరణించినట్లు కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
ఈ ఘటన పట్ల మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలు, క్షతగాత్రులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని అన్నారు. సోనోరా రెడ్‌క్రాస్ నుండి 40 మంది సిబ్బంది, 10 అంబులెన్సులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయని వివరించారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు గానీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ దుర్ఘటన సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications