'గే' మ్యారేజిలకు అమెరికా సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ఎక్కడైనా స్వలింగ జంటలు పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు మార్గం సుగమనమైంది.
'గే' మ్యారేజీలకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో గే జంటలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో గే, లెస్బియన్ జంటలు పెళ్లి చేసుకోడానికి 36 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాలో మాత్రమే ఉంది.

అమెరికన్ సుప్రీం కోర్టు తాజా తీర్పుతో అమెరికాలోని మిగతా 14 రాష్ట్రాల్లో కూడా గే, లెస్బియన్ పెళ్లిళ్లు జరగనున్నాయి. రెండేళ్ల కిందట గే మ్యారేజీలను వ్యతిరేకించే చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టి వేశారు.
శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. దీనికి చిహ్నాంగా అధ్యక్షుడి భవనమైన వైట్ హౌస్‌ను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.












Click it and Unblock the Notifications