ఇండోనేషియా విమాన శకలాలు గుర్తింపు..? సముద్రంలో ఆనవాళ్లు.. ధృవీకరించని అధికారులు
ఇండోనేషియాకు చెందిన శ్రీ విజయ విమానం సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది. జకార్తా నుంచి 62 మంది ప్రయాణికులతో బయల్దేరిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానం శకలాలు జకార్తా వెలుపల గల సముద్రంలో కనిపించినట్టు సహాయ చర్యలు చేపడుతున్న అధికారులు వివరించారు. పొంటియనిక్ ప్రాంతానికి బయల్దేరిన విమానం మధ్యాహ్నం 2.30 గంటలకు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
Recommended Video


విమానంలో 62 మంది ఉన్నారని.. వారిలో 12 మంది విమాన సిబ్బంది అని రవాణాశాఖ మంత్రి బుడి కర్యా తెలిపారు. జకార్తా ఉత్తరాన గల సముద్రంలో ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రేడియో సిగ్నల్ కనుగోలేమని రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి బగాస్ పురుహితో వివరించారు. అయితే విమానానికి సంబంధించి శిథిలాలు సముద్రంలో ఉన్నాయని.. అయితే అదీ శ్రీ విజయ ప్లైట్‌కు సంబంధించో కాదో ధృవీకరించాల్సి ఉందన్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాల తర్వాత ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తోంది. నిమిషం వ్యవధిలో 10 వేల అడుగుల ఎత్తు తగ్గిపోయిందని వివరించారు. అయితే ఇండోనేషియా మీడియా మాత్రం అనుమానాస్పద శిథిలాలకు సంబంధించి ఫోటోలను చూపిస్తున్నాయి. కానీ దానిని ధృవీకరించాల్సి ఉంది. నీటిపై కేబుల్స్, జీన్స్, లోహపు ముక్కలు తేలినట్టు గుర్తించామని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. లోహపు ముక్కలు కనిపించాయని స్థానిక మత్య్సకారుడు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications