వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్ట్ లింకులు: ఇండియన్ సహా 20 మంది అరెస్టు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉగ్రవాదులతో లింకులు పెట్టుకుని వారి కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపిస్తు 20 మందిని చైనా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 20 మందిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.

దక్షిణ ఆఫ్రికా కు చెందిన ఒక ట్రస్ట్ లో ఒక భారతీయుడు, 9 మంది బ్రిటన్ కు చెందిన వారితో సహ అనేక మంది పని చేస్తున్నారు. అయితే వీరు ట్రస్ట్ ముసుగులో ఉగ్రవాదులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులకు అనుమానం వచ్చింది.

Suspected terror links:Indian among 20 arrested in China

చాల కాలం నుండి వీరి మీద బ్రిటన్, చైనా పోలీసులు నిఘా వేశారు. కచ్చితమైన వివరాలు సేకరించారు. ఉత్తర మంగోలియాలోని ఎయిర్ పోర్టు నుండి 20 మంది చైనా బయలుదేరారు. విషయం తెలుసుకున్న చైనా పోలీసులు వీరిని అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు.

వీరు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకున్నారు, ఉగ్రవాదులకు ఏ విదంగా సహకరిస్తున్నారనే విషయాలపై పూర్తి విరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. అరెస్టు అయిన వారి పేర్లు, వివరాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రతలు తీసుకున్నారు. పర్యాటకుల ముసుగులో వీరు చైనాలో అడుగు పెట్టారు.

English summary
The reason behind their arrest remains unclear but the tourists, including nine Britons and one Indian, detained at Ordos airport in Inner Mongolia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X