ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా స్విట్జర్లాండ్: సర్వే
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా స్విట్జర్లాండ్ ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. మూడవ వార్షిక వరల్డ్ హాపీనెస్ నివేదిక ప్రకారం ఐస్‌ల్యాండ్, డెన్మార్క్, నార్వే, కెనడా దేశాలు ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయని 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్' (SDSN) అనే సంస్ధ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా 158 దేశాల్లో సంతోషం, శ్రేయస్సు స్ధాయిలను బట్టి ఈ అధ్యయనం చేశారు. ఇది ఇలా ఉంటే టోగో, బురుండి, సిరియా, బెనిన్, ర్వాండ దేశాల్లోని ప్రజలు అత్యంత అసంతృప్తితో జీవనం వెళ్లదీస్తున్నారని పేర్కొంది.
దేశ తలసరి జీడీపీ, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, అవినీతి స్థాయి, సాంఘిక స్వతంత్రతలను ఆధారంగా ఈ సర్వేని నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక శ్రేయస్సు ఎలా సాధించాలన్న దానికి ఈ నివేదిక సాక్ష్యాలను ఇస్తుందని, కేవలం డబ్బే కాకుండా, అందం, చిత్తశుద్ధి, నమ్మకం, మంచి ఆరోగ్యం కూడా సంతోషంగా జీవించడానికి కారణాలంటూ ఈ నివేదికలో పేర్కొన్నారు.

ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా వారి జీవన స్ధితి గతులను తెలిపేందుకు గాను ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్' (SDSN) అనే సంస్ధను 2012లో ప్రారంభించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications