సిడ్నీ కేఫ్ సీజ్: హరోన్ మోనిస్ ప్రేయసి టెర్రరిస్టా?
సిడ్నీ: సిడ్నీ లిండ్ చాకొలేట్ కేఫ్‌లోకి చొరబడి అక్కడి వారిని నిర్బంధించిన హరోన్ మోనిస్ ప్రేయిసి ఉగ్రవాది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను అమిరాహ్ ద్రౌదీస్‌గా చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోల ఆధారంగా ఆమె ఉగ్రవాది అని తెలుస్తోందని అంటున్నారు. ఆస్ట్రేలియా సైనికుల కుటుంబాలకు బెదిరింపు లేఖలు రాయడానికి మోనిస్‌కు సహాయం చేసి, అతన్ని ప్రేరేపించినందుకు 35 ఏళ్ల ఆమెను దోషిగా నిర్ధారించినట్లు ఆస్ట్రేలియా మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.
ఆమె ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. 2009లో యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలో నిఖాబ్ ధరించిన కనిపించిన మహిళ ద్రౌదీస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 11 శిక్షకు, బాలి శిక్షకు, హోలోకాస్ట్ శిక్షకు తాము సంతోషిస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డు అయింది. ఆమె ఉగ్రవాది అని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్‌సైట్ రాసింది.

సిడ్నీ కేఫ్ ఆపరేషన్ 16 గంటల తర్వాత విజయవంతంగా ముగిసింది. భవనంలోకి భద్రతా బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో భారీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మోనిస్ కూడా మరణించాడు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో 38 ఏళ్ల మహిళ, 24 ఏళ్ల పురుషుడు ఉన్నారు.
తనను తాను మోనిస్ షేక్‌గా, ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్నాడు. ఇరాన్‌లో జన్మించిన 50 ఏళ్ల మోనిస్ 1996లో శరణార్థిగా ఆస్ట్రేలియా వచ్చాడు. అతను వివాదాలకు అతీతుడేమీ కాడు. సైనిక అమరులకు బెదిరింపు లేఖలు రాసిన కేసులో అతను దోషి. అతను మాజీ భార్యను హత్య చేసినట్లు, పలు లైంగిక దాడులకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications