సిరియాపై అమెరికా క్షిపణి దాడి, 70 మిసైల్స్ ప్రయోగం
సిరియాపై అమెరికా క్షిపణి దాడులకు దిగింది. సిరియా ఎయిర్ బేస్‌లు టార్గెట్‌గా ఈ దాడులు నిర్వహించింది. 70కి పైగా క్షిపణిలను ప్రయోగించింది.
వాషింగ్టన్: సిరియాపై అమెరికా క్షిపణి దాడులకు దిగింది. సిరియా ఎయిర్ బేస్‌లు టార్గెట్‌గా ఈ దాడులు నిర్వహించింది. 70కి పైగా క్షిపణిలను ప్రయోగించింది. సిరియా అధ్యక్షుడు అసద్ నుంచి సిరియాను రక్షించేందుకే ఈ దాడి అని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.
ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఇది తొలి సైనిక చర్య. సిరియా అధ్యక్షుడు అసద్‌కు రష్యా మద్దతు ఇస్తొంది. మొత్తానికి సిరియా వేదికగా అమెరికా - రష్యా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

ఇటీవల సిరియాలో కెమికల్ అటాక్ జరిగింది. ఈ ఘటనలో వందలాది మంది చనిపోయారు. ఈ కెమికల్ దాడి వెనుక సిరియా సైన్యం ఉందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో సిరియా మిలిటరీనీ అమెరికా టార్గెట్ చేసింది.












Click it and Unblock the Notifications