సిరియా భూకంపం: శిథిలాల్లో జన్మించిన శిశువును ఎవరు దత్తత తీసుకున్నారంటే...

సిరియాలో భూకంపం శిథిలాల్లో జన్మించిన శిశువును ఆమె పిన్ని, బాయిలు దత్తత తీసుకున్నారు.
ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపంలో ఇద్రిస్ ప్రావిన్స్‌లోని జిందేరిస్ పట్టణంలో కుప్పకూలిన భవనాల్లో ఈ చిన్నారి కుటుంబం కూడా కన్నుమూసింది.
ఆ శిథిలాల్లో చనిపోయిన తల్లికి బొడ్డు పేగుతో అలాగే అనుసంధానమై ఉన్న ఆడపిల్లను సహాయ సిబ్బంది రక్షించారు.
భూకంపం వచ్చిన వెంటనే ఆమె తల్లికి పురిటినొప్పులు వచ్చాయని, ఆమె శిథిలాల కిందే బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూశారని ఒక బంధువు చెప్పారు.
భూకంపంలో ఈ శిశువు తల్లిదండ్రులతో పాటు.. నలుగురు తోడబుట్టువులు, ఒక పిన్ని అందరూ చనిపోయారు.
- తుర్కియే భూకంపం: 'పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
- తుర్కియే, సిరియా భూకంపం: ఈ పిల్లల పేర్లేమిటో, వారి తల్లిదండ్రులెవరో తెలీదు..ఏం చేయాలి?

అయితే ఈ శిశువు తల్లి సోదరి హాలా కుటుంబం ఈ భూకంపం నుంచి బయటపడింది. ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, ఈ శిశువుతో రక్తసంబంధం ఉందని నిర్ధారించుకున్న అధికారులు శిశువును వారికి అప్పగించారు.
దీంతో ఆ శిశువు తన పిన్ని, బాబాయిల దగ్గరికి చేరినట్లయింది. ఈ శిశువుకు చనిపోయిన ఆమె తల్లి పేరైన ఆఫ్రా అని పేరు పెట్టారు.
శిథిలాల నుంచి బయటకు తీసినపుడు ఈ శిశువుకు అధికారులు అయా అని పేరు పెట్టారు. ఆ అరబిక్ పేరుకు అర్థం 'అద్భుతం’ అని.
ఈ శిశువును వెలికితీసే సమయానికి శిథిలాల కింద 10 గంటల కన్నా ఎక్కువ సేపు ఉందని.. ఆమె ఒంటి నిండా గాట్లు, దోక్కుపోయిన గాయాలతో పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారు.
- తుర్కియే, సిరియా భూకంపం: శిథిలాలలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు ఏం చెబుతున్నారు?
- సంక్షోభం మీద సంక్షోభం: సిరియాకు భూకంప సహాయం అందించడం ఎందుకు కష్టమవుతోంది?
శిథిలాల నుంచి ఈ శిశువును వెలికితీస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచీ వేలాది మంది ఈ శిశువును తాము దత్తత తీసుకుంటామంటూ ముందుకు వచ్చారు.
ఈ పాపను శిథిలాల నుంచి వెలికి తీస్తున్నపుడు ఆమె బాబాయ్ ఖలీల్ అల్-సవాది కూడా అక్కడే ఉన్నారు.
ఆమెను దత్తత తీసుకుంటామని ప్రపంచం నలుమూలల నుంచీ వినతులు వెల్లువెత్తటంతో.. ఆ పాపను ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతారేమనని తను ఆందోళన చెందినట్లు ఆయన వార్తా సంస్థలతో చెప్పారు.
శిథిలాల్లో హలా, ఖలీల్‌ల నివాసం కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం వారు తమ బంధువుల వద్ద ఉంటున్నారు.
- భూకంపంలో శిథిలాల కింద చిక్కుకుంటే.. ప్రాణాలను కాపాడుకోవటం ఎలా
- భూకంపాల నుంచి హైదరాబాద్ ఎంత వరకూ సురక్షితం?

ఈ శిశువును బంధువులమైన తమకే అప్పగించాలని వారు కోరారు. భూకంపంలో తమ నివాసం దెబ్బతిన్నా, తమ పరిస్థితి ఎలా ఉన్నా.. ఆ శిశువు తన బంధువుల దగ్గర ఉండటమే మంచిదన్నారు.
దీంతో ఈ బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఆమె రక్తసంబంధీకులకు అప్పగించారు. ప్రస్తుతం బాలిక పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ చిన్నారి.. ఆమె తల్లిదండ్రులు, ఆమె కుటుంబానికి జ్ఞాపకంగా తమకు, తమ ఊరి వారందరికీ మిగిలిపోతుందని.. ఆమెను అపురూపంగా చూసుకుంటామని పిన్ని, బాబాయ్ చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- వారణాసి: నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?
- క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications