Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిరియా మరణ శాసనం రాసిన రెబెల్ గ్రూపులు ఇవే..!!

Syrian Civil War: సిరియాలో కొద్దిరోజుల కిందట ఆరంభమైన అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు, మిలీషియా గ్రూపులు ఉమ్మడిగా అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టారు. రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో దేశాధ్యక్షుడు బషర్ అల్- అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియరావట్లేదు. ఇరాక్‌కు పారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారింంచారు. కుటుంబ సభ్యులతో కలిసి సిరియా ఉత్తర ప్రాంతం మీదుగా సరిహద్దులను దాటుకుని ఉంటాడని చెబుతున్నారు.

Syrian Civil War Who are the Rebels how many groups are there

ఆయన రష్యాకు వెళ్లి ఉండొచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. రష్యాతో సుదీర్ఘకాలంగా మిత్రత్వాన్ని కొనసాగిస్తూ వస్తోన్నారు అల్-అస్సాద్. తిరుగుబాటుదారులు హామ్స్ నగరాన్ని సొంతం చేసుకున్న వెంటనే ఆయన అప్రమత్తం అయ్యారని, వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లో మాస్కోకు తరలి వెళ్లారని అంటున్నారు.

బషర్ అల్-అస్సాద్ కుటుంబం 50 సంవత్సరాల పాటు సిరియాను పరిపాలించింది. 1971 నుంచి 1999 వరకు బషర్ తండ్రి హఫెజ్ అల్-అస్సాద్ దేశాధ్యక్షుడిగా వ్యవహించారు. 29 సంవత్సరాల పాటు ఆయన ఏలుబడిలో సాగింది సిరియా. 2000 నుంచి ఇప్పటివరకు బషర్ పరిపాలన సాగిస్తోన్నారు. చివరికి ఆయన ప్రభుత్వం పతనం అయింది.

కొద్దిరోజులుగా సిరియాలో అంతర్యుద్ధం రాజుకున్న విషయం తెలిసిందే. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ వచ్చారు. రెండో అతిపెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకోవడంతోనే వారి ఆదిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత యధేచ్ఛగా కొనసాగింది.

Syrian Civil War Who are the Rebels how many groups are there

రెబెల్స్ ధాటికి సనా, హమా, హామ్స్ నగరాలను కోల్పోయింది సిరియా సైన్యం. పలు రీజియన్లు ప్రభుత్వ నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటులదారుల నియంత్రణలోకి వెళ్లాయి. శనివారం రాత్రికి రాజధాని డమాస్కస్‌‌కూ చేరుకున్నాయి రెబెల్ గ్రూప్స్. హామ్స్‌ను చేజిక్కించుకున్న తరువాత ఆయా బలగాలన్నీ కూడా రాజధానికి సమీపించాయి. శివారు ప్రాంతాలను చుట్టుముట్టాయి.

1. మొత్తం ఏడు తిరుగుబాటు గ్రూపులు సిరియాలో చాలాకాలంగా క్రియాశీలకంగా ఉంటూ వస్తోన్నాయి. ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం హయత్ తాహిర్ అల్- షామ్ దీనికి సారథ్యం వహించినట్లు అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. సిరియాలోని ఇడ్లిబ్ ప్రధాన కేంద్రంగా ఇది కార్యకాలాలను నిర్వహిస్తోంది. లెబనాన్‌కూ విస్తరించింది. మిలటరీ కమాండర్ అబు మహ్మద్ జొలానీ దీన్ని స్థాపించారు.

2. ది సిరియన్ నేషనల్ ఆర్మీ: బషర్ అల్- అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోన్న గ్రూపులన్నీ కలిసి ది సిరియన్ నేషనల్ ఆర్మీగా ఆవిర్భవించాయి. దీనికి టర్కీ సహకారాన్ని అందించింది. నిధులు, పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని సరఫరా చేసిందనే అంచనాలు ఉన్నాయి.

Syrian Civil War Who are the Rebels how many groups are there

3. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్: ఇదో సంకీర్ణ కూటమి. మొదటి నుంచీ బషర్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ వస్తోన్న అహ్రార్ అల్-షామ్ సారథ్యంలో ఇది పని చేస్తోంది. షరియా చట్టాన్ని అనుసరించే ఇస్లామిక్ స్టేట్‌గా సిరియాను ప్రకటించాలనేది ప్రధాన లక్ష్యం.

4. ఫ్రీ సిరియన్ ఆర్మీ, 5. సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్, 6, పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్, 7. డ్రూజ్ రిలీజియస్ మైనారిటీ.. వంటి కొన్ని స్థానిక వేర్పాటువాద గ్రూపులు.. ఈ అంతర్యుద్ధంలో పాలుపంచుకున్నాయి. అయిదు దశాబ్దాల పాటు సాగిన బషర్ అల్- అస్సాద్ ప్రభుత్వానికి మరణశాసనం రాశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+