తైవాన్ విమాన ప్రమాదం: 31 చేరిన మృతుల సంఖ్య

తైపీ: తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 31 చేరింది. మరో 12 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్రాన్స్‌ ఏషియా విమానం తైపీ నదిలో కూలిపోయిన విషయం తెలిసిందే. అందులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులతో పాటు విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. తైవాన్ రాజధాని టైపీ వెలుపల గల నదిలో బుధవారంనాడు ఆ విమానం కూలింది. దేశీయ ట్రాన్స్‌ఆసియా ఎటిఆర్ 72-600 టర్బోప్రోప్ విమానం రోడ్డు వంతెనను తాకి నదిలో పడినట్లు సమాచారం.

taipei flight crash: death toll reaches 31

విమానం తైపీ నుంచి కెన్మెన్ విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. విమానం కూలుంగ్ నదిలో ఒడ్డుకు 100 మీటర్ల దూరంలో ఉన్నట్లు తైవాన్ మీడియా ప్రసారం చేసిన చిత్రాలు తెలియజేశాయి. తైపీ నుంచి బయలుదేరిన విమానానికి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం గం.10.55 నిమిషాలకు ఫ్లైట్ కంట్రోలర్స్‌తో సంబంధం తెగిపోయింది.

విమానం ఫ్రాన్స్ తయారు చేసిన రెండు ఇంజన్ల టుర్బో‌ప్రోప్ ఎటిఆర్ 72గా తేలింది. ప్రయాణికుల్లో 31 మంది చైనాకు చెందినవారని తెలుస్తోంది. విమానంలోకి దారి చేసుకోవడానికి సహాయక బృందాలు లగేజీని తీసేశారు. విమానం రెక్క ఒక్కటి టాక్సీని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. టాక్సీ డ్రైవర్ గాయపడ్డాడు. 165 మందితో ఎనిమిది పడవలు స్థానికులకు సహకరిస్తున్నట్లు తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

విమాన ప్రమాదానికి గల కారణాలను వెల్లడించడానికి ట్రాన్స్ ఏషియా మీడియా కార్యాలయం నిరాకరించింది. విషయాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పింది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తైవాన్ సివిల్ ఏరోనాటిక్స్ అధికార యంత్రాంగం కూడా చెప్పలేకపోతోంది. ఇదే తైపీకి చెందిన ఎయిర్‌లైన్ విమానం గత జులై 23వ తేదీన పెంఘూ దీవుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మరణించారు. ప్రస్తుత ప్రమాదం 64 ఏళ్ల ఎయిర్‌లైన్ ప్రతిష్టను దెబ్బ తీసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+