చైనాతో యుద్ధానికి సన్నద్ధం: విన్యాసాలు షురూ: జో బైడెన్ ఆ ప్రకటనతో
తైపే: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోంది. వేలాదిమంది మరణించారు. పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని కీలక నగరాలను రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాటిని విడిపించుకోవడానికి ఉక్రెయిన్ పోరాడుతోంది. అమెరికా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న యుద్ధ సామాగ్రితో రష్యా సైన్యాన్ని అడ్డుకుంటోంది.

చైనా-తైవాన్ మధ్య..
ఈ పరిణామాల మధ్య మరో యుద్ధం మొదలయ్యే ప్రమాదం లేకపోలేదు. చైనా-తైవాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోన్నాయి. అమెరికా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ పర్యటించిన వెళ్లిన తరువాత ఈ రెండు దేశాల మధ్య ఈ తరహా వాతావరణం నెలకొంది. న్యాన్సీ పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తూ- ఆమె తైవాన్‌లో ఉండగానే యుద్ధ విన్యాసాలను మొదలు పెట్టింది చైనా. దాన్ని కొనసాగిస్తూ వచ్చింది.

తైవాన్ చుట్టూ..
తైవాన్ మీదుగా బాల్లిస్టిక్ క్షిపణులను సైతం సంధించింది. తైవాన్ గగనతలంలో సైతం చైనా యుద్ధ విమానాలు తిరుగాడాయి. శక్తిమంతమైన మిస్సైళ్లను తైవాన్ సముద్ర జలాల్లోకి సంధించింది. ద్వీపదేశం చైనాను చుట్టుముట్టి మరీ తన యుద్ధ విన్యాసాలను చేపట్టింది. పూర్తిస్థాయి యుద్ధ సన్నాహక విన్యాసాలు అవి. యాంటీ సబ్-మెరైన్, ఆకాశం నుంచి యుద్ధ నౌకలను ధ్వంసం చేసే మిస్సైళ్లను పరీక్షించింది. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో ఈ విన్యాసాలు సాగాయి.

ఆందోళన చెందట్లేదు గానీ..
చైనా యుద్ధ విన్యాసాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అవేవీ తమను ఆందోళన కలిగించట్లేదు గానీ దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నామని ప్రకటించారు. యుద్ధ విన్యాసాలకు మించి చైనా మరో అడుగు ముందుకు వేయకపోవచ్చని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామనీ జో బైడెన్ వ్యాఖ్యానించడం..అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.

జో బైడెన్ స్పందించిన వెంటనే..
జో బైడెన్ స్పందించిన కొన్ని గంటల వ్యవధిలోనే- తైవాన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తానూ యుద్ధ విన్యాసాలను మొదలు పెట్టింది. పూర్తిస్థాయి యుద్ధ సన్నాహకాలకు దిగింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన డ్రిల్‌కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తైవాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. అక్కడి కాలమానం ప్రకారం- అర్ధరాత్రి 12:40 నిమిషాలకు యుద్ధ విన్యాసాలను మొదలు పెట్టినట్లు 8వ ఆర్మీ కార్ప్స్ అధికార ప్రతినిధి లౌ వొయ్-జ్యె తెలిపారు. గంటన్నర పాటు కొనసాగించామని పేర్కొన్నారు.

పూర్తిస్థాయి విన్యాసాలు..
పింగ్టంగ్ కంట్రీ తీర ప్రాంత సమీపంలో దక్షిణ ప్రాంత సముద్ర జలాల్లో ఈ విన్యాసాలు మొదలు పెట్టామని చెప్పారు. నౌకా, వైమానిక దళాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టామని వివరించారు. తొలిదశలో గంటన్నర పాటు వాటిని కొనసాగించామని స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు అందిన తరువాత పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు కాస్త.. చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసినట్టయింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications