'భాగస్వామితో శృంగారం కోసం.. పనివేళల్లో ఒక గంట బ్రేక్!..'

పెయిడ్ బ్రేక్(వేతనంతో కూడిన విరామం) ఇస్తే.. ఆ సమయంలో ఉద్యోగులు ఇంటికెళ్లి తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.

స్వీడన్: ఆధునిక సమాజంలో మనిషి టెక్నాలజీకి ఎంత దగ్గరయ్యాడో సన్నిహితులకు అంత దూరమయ్యాడు. అయితే ఆఫీసులో పని.. లేదంటే సోషల్ మీడియాలో తలదూర్చడం.. వ్యాపకమేదైనా సరే!.. ఆఖరికి ఇంట్లో శ్రీమతితోను చాలామంది భర్తలు ఏకాంత సమయాన్ని వెచ్చించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు స్వీడన్ కు చెందిన పెర్ ఎరిక్ మస్కోస్(42) అనే కౌన్సిలర్ ఓ ఆసక్తికర ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. పనివేళల్లో ఒక గంటపాటు పెయిడ్ బ్రేక్(వేతనంతో కూడిన విరామం) ఇస్తే.. ఆ సమయంలో ఉద్యోగులు ఇంటికెళ్లి తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.

Take sex breaks on work time, Swedish town councillor proposes

ఆరోగ్యకర జీవితానికి శృంగారం ఉపయోగపడుతుందన్న పలు అధ్యయనాల గురించి ఈ సందర్బంగా మస్కోస్ ప్రస్తావించారు. ప్రస్తుత బిజీ జీవితాలతో భార్యాభర్తలు ఎక్కువ సమయం గడపడం లేదని, ఇలాంటి ప్రతిపాదనలు ఆ లోటును భర్తీ చేస్తాయని అన్నారు. తన ప్రతిపాదనను మంగళవారం నాడు కౌన్సిల్ లో ప్రవేశపెట్టారు.

అయితే ఉద్యోగులకు కేటాయించే పెయిడ్ బ్రేక్ ను సద్వినియోగం చేసుకుంటున్నారా? లేక దుర్వినయోగం చేస్తున్నారా? అన్నది గుర్తించడం కాస్త కష్టమేనని, అయినా సరే ఉద్యోగులపై నమ్మకం ఉంచి కంపెనీలు ఈ పెయిడ్ విరామానికి అవకాశం ఇవ్వాలని ఆయన అంటున్నారు. తను ప్రవేశపెట్టిన తీర్మానం కౌన్సిల్ లో ఆమోదం పొంది తీరుతుందని ఎరిక్ మస్కోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+