పాకిస్తాన్ పై యుద్ధానికి రెడీ..! తాలిబన్ల స్ట్రాంగ్ వార్నింగ్..!
భారత ఉపఖండంలో మరో యుద్ధం తప్పేలా లేదు. ఇప్పటికే భారత్ కు దగ్గరవుతున్న తాలిబాన్లను టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ ..
గత నెలలో ఆప్ఘనిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు ఆప్ఘన్ పౌరులతో పాటు ముగ్గురు క్రికెటర్లు కూడా చనిపోయారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ తరుణంలో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ రెండు దేశాల మధ్య చర్చలకు అంగీకరింపజేశారు. అయితే తాజాగా ఈ రెండు దేశాల చర్చలు విఫలమయ్యాయి.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో తాజాగా పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఇందులో ఆప్ఘనిస్తాన్ పెట్టిన డిమాండ్లకు పాకిస్తాన్ అంగీకరించలేదు. దీంతో ఈ చర్చలు కాస్తా విఫలమయ్యాయి. టర్కీ, ఖతార్ ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేశాయి. ఈ చర్చల విఫలం తర్వాత పాకిస్తాన్ అభివృద్ధిని అడ్డుకుంటోందని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

తాలిబాన్ ప్రభుత్వం రెండు సోదర దేశాలు టర్కీ, ఖతార్ చర్చలను నిర్వహించి మధ్యవర్తిత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. నవంబర్ 6 మరియు 7 తేదీలలో జరిగిన చర్చలకు ఆఫ్ఘన్ ప్రతినిధులు మంచి విశ్వాసంతో, తగిన అధికారంతో హాజరయ్యారని.. పాకిస్తాన్ చివరకు ఈ సమస్యను తీవ్రంగా, నిర్మాణాత్మకంగా ముగిస్తుందని ఆశించినట్లు తెలిపింది. అయితే, పాకిస్తాన్ మరోసారి తన "బాధ్యతారాహిత్యం మరియు సహకారేతర వైఖరిని" ప్రదర్శించిందని ఆరోపించింది.

తన భద్రతకు సంబంధించిన అన్ని బాధ్యతలను ఆఫ్ఘన్ ప్రభుత్వం తీసుకోవాలని, కానీ ఆప్ఘన్ భద్రతకు మాత్రం పాకిస్తాన్ హామీ ఇవ్వడం లేదని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్తాన్ ప్రవర్తన వల్ల చర్చలు ఫలించలేదని వెల్లడించింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ తన గడ్డను మరొక దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ఎవరినీ అనుమతించరని, ఏ విదేశీ దేశం దాని సార్వభౌమాధికారం, స్వాతంత్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి అనుమతించరని తమ వైఖరి తేల్చేసింది. కాబట్టి విదేశీ దురాక్రమణల నుంచి ఆప్ఘనిస్తాన్ ను రక్షించుకుంటామని తెలిపింది. యుద్ధం చెలరేగితే ఆఫ్ఘనిస్తాన్ పెద్దలు, యువత ఇద్దరూ పోరాడటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది.
-
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
మొదటి రోజే పరువు పాయే! తెల్ల బంతి కాస్తా గులాబీగా మారింది! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications