Taliban talks: సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలేది బూడిదే, అమీర్ ఖాన్ ఎంట్రీ, లీడర్స్ తో చర్చలు !
కాబూల్/ అఫ్గానిస్తాన్/ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ లో ఆ దేశం మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పాలనకు చెక్ పెట్టిన తాలిబన్లు ఇప్పుడు కొత్త అరాచక పాలన మొదలు పెట్టడానికి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నారు. అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచిపారిపోయేలా చేసిన తాలిబన్లు ఆదేశ ప్రజలను సామాన్యంగా వదిలిపెడుతారా ? అంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో తాలిబన్లు ఆచూతూచి అడుగులు వేస్తున్నారు. ఇంతకాలం అఫ్గానిస్తాన్ లో పత్రిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులతో తాలిబన్లు చర్చలు మొదలు పెట్టారని వెలుగు చూసింది. గతంలో తాలిబన్ ప్రభుత్వంలో ఉన్నత శిక్షణా శాఖా మంత్రిగా పని చేసిన అమీర్ ఖాన్ ముట్టాకి ఇప్పటికే రంగంలోకి దిగి అఫ్గానిస్తాన్ లోని వివిద రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
Recommended Video
గతంలో తాలిబన్ల ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన నాయకులతో అమీర్ ఖాన్ ముట్టాకి ఇప్పటికే మంతనాలు జరిపారని, తాలిబన్ల గ్రూప్ లీడర్లు ఇప్పుడు ఆ దేశా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని ఏకం చేసే పనిలో పడ్డారని సమాచారం. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందని, తాలిబన్లు వచ్చినా, అందులో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నా మా బతుకులు తెల్లారిపోయేది మాత్రం గ్యారెంటీ అంటూ ఆ దేశం వదిలిపెట్టి బయటపడలేదని సామాన్య ప్రజలు సైలెంట్ గా ఉండిపోతున్నారని సమాచారం. మొత్తం మీద గత తాలిబన్ ప్రభుత్వంలో పని చేసిన రాజకీయ నాయకులకు ఇప్పుడు తాలిబన్ ల ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తారని, అందులో ఎలాంటి డౌట్ లేదని తెలిసింది.

పెట్టేపేడా సర్దుకుని రైట్ రైట్
అఫ్గానిస్తాన్ లో ఆ దేశం మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పాలనకు చెక్ పెట్టిన తాలిబన్లు ఇప్పుడు కొత్త అరాచక పాలన మొదలు పెట్టడానికి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నారు. అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పెట్టేపేడా సర్దుకుని ఆ దేశం విడిచిపారిపోయేలా చేసిన తాలిబన్లు ఆదేశ ప్రజలను సామాన్యంగా వదిలిపెడుతారా ? అంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

క్రిమినల్ మైండ్ తో అన్నీ ఆలోచిస్తున్న తాలిబన్లు
అఫ్గానిస్తాన్ లో పాగా వేసిన తాలిబన్లు ఇప్పుడు ఆచూతూచి అడుగులు వేస్తున్నారు. తాలిబన్ల క్రిమినల్ మైండ్ కు కొన్ని రాజకీయ పార్టీల నాయకుల మద్దతు అవసరం అని ఆ గ్రూప్ లీడర్లు ఆలోచిస్తున్నారని సమాచారం. ఇంతకాలం అఫ్గానిస్తాన్ లో పత్రిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులతో తాలిబన్లు చర్చలు మొదలు పెట్టారని వెలుగు చూసింది.

అమీర్ ఖాన్ ఎంట్రీ
గతంలో తాలిబన్ ప్రభుత్వంలో ఉన్నత శిక్షణా శాఖా మంత్రిగా పని చేసిన అమీర్ ఖాన్ ముట్టాకి రంగంలోకి దిగి అఫ్గానిస్తాన్ లోని వివిద రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. గతంలో తాలిబన్ల ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన నాయకులతో ఇప్పటికే అమీర్ ఖాన్ ముట్టాకి మంతనాలు జరిపారని సమాచారం. తాలిబన్ల గ్రూప్ లీడర్లు ఇప్పుడు ఆ దేశా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని ఏకం చేసే పనిలో పడ్డారని సమాచారం.

సన్యాసి సన్యాసి రాసుకుంటే కిందపడేది బూడిదే !
అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు కొన్ని రాజకీయ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నా అక్కడి ప్రజలకు మాత్రం భయం దగ్గడం లేదు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందని, తాలిబన్లు వచ్చినా, అందులో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నా మా మా బతుకులు తెల్లారిపోయేది మాత్రం గ్యారెంటీ అంటూ ఆ దేశం వదిలిపెట్టి బయటపడలేదని సామాన్య ప్రజలు ఏమీ చెయ్యలేని పరస్థితుల్లో సైలెంట్ గా ఉండిపోతున్నారు.

ఎదురు తిరిగితే తలలు ఎగిరిపడతాయ్ !
గతంలో తాలిబన్ ప్రభుత్వంలో పని చేసిన రాజకీయ నాయకులకు ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తారని, అందులో ఎలాంటి డౌట్ లేదని తెలిసింది. తాలిబన్లతో కలిసి పని చేసే రాజకీయ నాయకులు ప్రాణాలతో ఉంటారని, ఎదురు తిరిగిన వారి తలలు ఎగిరిపడటం గ్యారెంటీ అని కొందరు అంటున్నారు.

కింగ్ మేకర్లు ఎవరైనా రింగ్ మాస్టర్ మాత్రం తాలిబన్
అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో ఎవరున్నా తాలిబన్లు ఆడినట్లు ఆడాలని, ఇంతకాలం కింగ్ మేకర్లు ఎవరైనా సరే ఇప్పుడు తాలిబన్లు మాత్రమే రింగ్ మాస్టర్లు అని అఫ్గానిస్తాన్ లోని రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారని సమాచారం. ఎందుకంటే తాలిబన్లకు ఇప్పటికే కఠినమైన చట్టాలు అమలు చేశారు. ఇక ముందు కూడా అంతకంటే కఠినమైన చట్టాలు అమలు చేస్తారని ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూసుకుంటే మంచిది.... లేదంటే మూడుతుంది
తాలిబన్ల షరతులకు అంగీకరించి వారు చెప్పినట్లు సైలెంట్ గా ఉండిపోతే ఎలాంటి సమస్య ఉండదని, లేదంటే ఈ జీవితానికి మూడుతుందని కొందరు రాజకీయ పార్టీల నాయకులు వారి చెప్పినట్లు వినడానికి సిద్దం అయ్యారని సమాచారం. ఇంతకాలం అష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలో చక్రం తప్పిన నాయకుల పరిస్థితి ఇక ముందు దారుణంగా తయారౌతుందని, అసలు వారు ప్రాణాలతో ఉంటారా ? లేదా ? అనే విషయం చెప్పడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద అఫ్గానిస్తాన్ లోని అరాచకపాలనలో కొందరు రాజకీయ పార్టీల నాయకులకు అవకాశం చిక్కుతుందని సమాచారం.












Click it and Unblock the Notifications