Taliban: మీరు చదువుకుని ఎవరిని ఉద్దరిస్తారు ?, నోరుమూసుకుని ఇంట్లో ఉండండి, మహిళలకు షాక్ !
కాబూల్/అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్లు వారి అరచకాలను మెల్లిమెల్లిగా కొనసాగిస్తున్నారు. ఒకేసారి ప్రతాపం చూపిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురౌతుందని భయపడిన తాలిబన్లు ఇప్పుడు వారి పైచాచికం ప్రదర్శించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈసారి మహిళల మీద తాలిబన్లు పంజా విసిరారు. మేము చెప్పిందే వేదం, మేము చెప్పినట్లు వినాలి అంటూ తాలిబన్లు ఆదేశంలోని మహిళలకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు కాలేజ్ లకు వెళ్లకుండా నిషేధించారు.

తాలిబన్లు అంటేనే రాక్షసులు
తాలిబన్లు అంటే రాక్షసులు అని అనేక దేశాల ప్రజలు అంటున్నారు. తాలిబన్ల శిక్ష ఎలాగుంటుది అని కొత్తగా చెప్పనవసరం లేదు. మహిళలను నడిరోడ్డు నిలబెట్టి చుట్టు నిలబడిన ప్రజలతో రాళ్లతో కొట్టించి చంపించడం, ప్రజల ముందు గాలిలో వేలాడదీసి తుపాకులతో కాల్చడం, నడిరోడ్డులో నిలబెట్టి తల నరకడం ఇలా వాళ్ల అరచకాలకు హద్దులు లేకుండా పోయాయి.

అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకుని ?
అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు వారి అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు వారి పైత్యం చూపించడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకేసారి ప్రతాపం చూపిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురౌతుందని భయపడిన తాలిబన్లు ఇప్పుడు వారి పైచాచికం ప్రదర్శించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

మహిళలకు ఉన్నత చదువులు ఎందుకు ?
అఫ్గానిస్తాన్ స్వాధీనం చేసుకున్న తరువాత ఆదేశంలోని మహిళలను ఉక్కుపాదంతో తొక్కేయాలని తాలిబన్లు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్ మహిళల మీద వారి ప్రతాపం చూపించారు. మహిళలు ఉన్నత చదవులు చదవడానికి వీలు లేదని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు ఉన్నత చదువులు చదవడానికి అక్కడి విద్యాసంస్థలు యువతులకు అవకాశం ఇవ్వకూడదని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.

తాలిబన్ మీడియా ఏం చెప్పిందంటే ?
అఫ్గానిస్తాన్ లో ఇక ముందు యువతులు ఉన్నత చదువులు చదవడానికి వీలుదేని, కాలేజ్ లకు వెళ్లే ఆలోచన చెయ్యకూడదని తాలిబన్ మీడియా సంస్థ టోల్ ట్విట్ చేసింది. మహిళలు ఉన్నత చదువులు ఎందుకు చదవాలి, మహిళలు ఉన్నత చదువులు చదవడానికి మేము అంగీకరించమని గతంలో కూడా తాలిబన్లు చెప్పిన విషయం తెలిసిందే. తాలిబన్ల నిర్ణయంతో ఆదేశంలోని మహిళలు ఇక ముందు ఉన్నత విద్యాభ్యాసం చెయ్యడానికి అవకాశం లేకుండాపోయింది.












Click it and Unblock the Notifications