మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత

Talking Duck మాట్లాడే బాతు

అచ్చు 'యూ బ్లడీ ఫూల్' అని ఎవరో అన్నట్టుగానే ఉన్న కస్తూరి బాతు ఆడియోను పరిశోధకులు విడుదల చేశారు.

ఆస్ట్రేలియాలో కనిపించే కస్తూరి బాతులు శబ్దాలను అనుకరించగలవని చెప్పడానికి 34 ఏళ్ల కిందటి ఈ ఆడియో రికార్డింగ్ డాక్యుమెంట్ మొదటి సాక్ష్యంగా నిలిచింది.

పరిశోధకులు డాక్టర్ పీటర్ ఫుల్లగర్ 1987 లో కాన్‌బెర్రా సమీపంలోని టిడ్బిన్‌బిల్లా నేచర్ రిజర్వ్‌లో కస్తూరి బాతు రిప్పర్‌ వాయిస్‌ను రికార్డ్ చేశారు.

నాడు ఆయన చేసిన రికార్డింగులను ఇటీవల నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కారెల్ టెన్ కేట్ తిరిగి వెలుగులోకి తెచ్చారు.

పక్షులలో స్వర అభ్యాసంపై ప్రొఫెసర్ టెన్ కేట్ అధ్యయనం చేస్తుండగా, తలుపు కొట్టుకుంటుండగా వచ్చే శబ్దాన్ని కూడా ఈ బాతు అనుకరించగలదని సరికొత్త అంశాన్ని గుర్తించారు.

''కస్తూరి బాతులు శబ్దాలను అనుకరించగలగడం చాలా ఆశ్చర్యం కలిగించింది. దీన్ని ఇప్పటివరకు స్వర అభ్యాస రంగంలో పరిశోధకులు ఎవరూ గుర్తించలేదు'' అని ప్రొఫెసర్ టెన్ కేట్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

''తిరిగి ఆవిష్కరించిన ఈ విషయం చాలా ప్రత్యేకమైనది'' అని చెప్పారు.

శబ్దాలను అనుకరించడం అరుదైన లక్షణం. డాల్ఫిన్లు, తిమింగలాలు, ఏనుగులు, గబ్బిలాలు స్వర అభ్యాసం చేస్తాయనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రకృతిలోని చాలా రకాల క్షీరదాల్లో ఈ తరహా అలవాటు కనిపించదు.

అయితే, కొన్ని పక్షులు, ముఖ్యంగా చిలుకలు వివిధ శబ్దాలను అనుకరించగలవు.

''ఈ సమూహాల్లోనూ స్వర అభ్యాసం చాలా అరుదు'' అని ప్రొఫెసర్ టెన్ కేట్ చెప్పారు.

''చిలుకలు, హమ్మింగ్‌బర్డ్స్ నిర్దిష్ట శబ్దాలు చేయడం నేర్చుకోగలవని మనకు తెలుసు. ఇందులో అనేక జాతులు ఉన్నాయి. కానీ ఈ సమూహాల పూర్వీకుల జాతులే స్వర అభ్యాసాన్ని ఒంటపట్టించుకున్నాయి.''

మొత్తం 35 రకాల పక్షి జాతుల ఆర్డర్లలో మూడు మాత్రమే గతంలో స్వర అభ్యాసం చేసేవని పరిశోధకులు భావించేవారు.

కానీ, రిప్పర్‌ ఆడియోతో ఇప్పుడు ప్రొఫెసర్ టెన్ కేట్ ఈ సమూహంలో కొత్త ఆర్డర్ ను చేర్చనున్నారు.

''ఇలాంటి సమూహాల్లో స్వర అభ్యాసం గమనించడం అనేది చాలా గొప్ప విషయం'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+