బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను పరీక్షంచబోయి.. ప్రాణాలే కోల్పోయాడు, ఎందుకలా?

ఫ్లోరిడా: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను పరీక్షించాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం నాడు ఫ్లోరిడాలోని టంపాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

టంపాలో నివాసముండే జోక్విన్ మెండాజ్ అనే యువకుడు (23) ఓ పాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను పరీక్షించాలనుకున్నాడు. ఇందుకోసం ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను ధరించి, అతడి కజిన్ అలెగ్జాండ్రియో గరిబాల్డి(24)ని తుపాకీతో షూట్ చేయాల్సిందిగా కోరాడు.

Tampa man testing bullet-proof vest dies after cousin shoots him

తుపాకితో తన గుండెపై కాల్చాలని మెండాజ్ కోరడంతో.. గురి చూసి మెండాజ్ గుండెపై కాల్చాడు అలెగ్జాండ్రియా. అంతే మెండాజ్ గుండెలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న మెండాజ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెండాజ్ ను అలెగ్జాండ్రియో గన్ తో షూట్ చేస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. అలెగ్జాండ్రియా కూడా నేరం అంగీకరించడంతో.. హత్యానేరం కింద అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+